Sat Jan 11 2025 10:37:29 GMT+0000 (Coordinated Universal Time)
తెనాలి రామకృష్ణగా మారనున్న సందీప్
కుర్ర హీరో సందీప్ కిషన్... తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ అనే ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ ఒప్పుకున్నారు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. హన్సిక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. సందీప్ కిషన్ తో ఈమె నటించబోయే తొలి సినిమా ఇదే. వెన్నెల కిషోర్, మురళి శర్మ, పృథ్వీ ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డిసెంబర్ 14న ఈ చిత్ర ఓపెనింగ్ జరగనుంది. అదే రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానుంది.
Next Story