Mon Dec 23 2024 18:35:09 GMT+0000 (Coordinated Universal Time)
Chiranjeevi : వామ్మో.. చిరంజీవికి సందీప్ వంగ ఇంత పెద్ద అభిమానా..
చిరంజీవికి తాను పెద్ద ఫ్యాన్ ని అంటూ సందీప్ రెడ్డి వంగ చెబుతుంటారు. కానీ మరీ ఇంత పెద్ద అభిమాని అని మాత్రం అనుకోలేదు.
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి సపరేట్ గా చెప్పనవసరం లేదు. ఆయనికి ఆడియన్స్ లో మాత్రమే కాదు, సినిమా ఇండస్ట్రీలో పని చేసే దర్శకులు, హీరోల్లో కూడా అభిమానులు ఉంటారు. అలా ప్రస్తుతం ఇండస్ట్రీలో డైరెక్టర్స్ గా పని చేస్తున్న సందీప్ వంగ, బాబీ, ప్రశాంత్ నీల్ వంటి వారు చిరుకి అభిమానులే. చిరంజీవి సినిమాలు, హీరోయిజం ఇన్ఫ్లుయెన్స్ తోనే.. ఈ దర్శకులు పలు సినిమాలు తెరకెక్కిస్తూ వస్తున్నారు.
ఇక రీసెంట్ గా 'యానిమల్'తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సందీప్ వంగ.. చిరంజీవికి పెద్ద ఫ్యాన్ ని చెప్పుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సందీప్ వంగ 27ఏళ్ళ క్రిందటి సినిమాలో చిరంజీవి వేసుకున్న షర్ట్ కలర్ చెప్పి.. తాను చిరుకి ఎంత పెద్ద అభిమానో తెలియజేశారు. చిరంజీవి ఇంప్రెషన్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ తన పై ఎప్పుడు ఉంటుందని చెప్పిన సందీప్ వంగ.. మాస్టర్ మూవీలో చిరంజీవి చేసిన ఓ సీన్ తనని ఎంతగా ఆకట్టుకుందో తెలియజేశారు.
ఆ సినిమాలో చిరంజీవి.. హీరోయిన్ కి తన గతం గురించి తెలుసా అని ప్రశ్నిస్తూ, అగ్రెసివ్ గా నటించే సన్నివేశం ఉంటుంది. ఆ సీన్ లో చిరంజీవి సిగరెట్ తాగుతూ డైలాగ్ చెప్పిన విధానం తనని ఎంతోగానో ఆకట్టుకుందని వెల్లడించారు. అది తన సినిమాల్లో కనిపిస్తుందని పేర్కొన్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే ఆ సీన్ లో చిరంజీవి వేసుకున్న షర్ట్ కలర్ తో సహా సందీప్ వంగ మాట్లాడారు.
ఆ సీన్ లో చిరంజీవి గ్రీన్ షర్ట్ వేసి కనిపిస్తారని సందీప్ వంగ చెప్పడం.. మెగా అభిమానులను ఆశ్చర్య పరుస్తుంది. చిరంజీవికి సందీప్ వంగ ఇంత పెద్ద అభిమానా అని ఆశ్చర్యపోతున్నారు. చిరంజీవి తన అభిమాని బాబీకి ఛాన్స్ ఇచ్చి 'వాల్తేరు వీరయ్య' వంటి సూపర్ హిట్ చేశారు. అలాగే ఇప్పుడు సందీప్ వంగకి కూడా అవకాశం ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. సందీప్ వంగ కూడా సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి చిరంజీవి ఎప్పుడు అవకాశం ఇస్తారేమో చూడాలి.
Next Story