Mon Dec 23 2024 19:01:23 GMT+0000 (Coordinated Universal Time)
Prabhas : అన్స్టాపబుల్ షోలో ప్రభాస్ 'స్పిరిట్' అప్డేట్.. బన్నీ ఫ్యాన్స్ బాధ..
అన్స్టాపబుల్ షోలో ప్రభాస్ 'స్పిరిట్' అప్డేట్ ఇచ్చిన సందీప్ వంగా. ఆ అప్డేట్ తో బాధ పడుతున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్.
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'సలార్' వచ్చే నెలలో రిలీజ్ కి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అయితే ఈ రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయ్యిపోయిందా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రంతో పాటు కల్కి 2898 AD, మారుతీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రాలు తరువాత 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' అనే సినిమా చేయనున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక రీసెంట్ గా సందీప్ వంగా డైరెక్ట్ చేసిన 'యానిమల్' మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి.. ఈ ఇద్దరి కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా? అని ఫ్యాన్స్ లో మరింత క్యూరియాసిటీ పెరిగిపోయింది. తాజాగా ఈ మూవీ గురించిన క్రేజీ అప్డేట్ ని సందీప్ వంగా ఆడియన్స్ కి ఇచ్చారు.
యానిమల్ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న సందీప్ వంగా.. రీసెంట్ గా బాలయ్య అన్స్టాపబుల్ షోకి రణబీర్ కపూర్ అండ్ రష్మిక మందన్నతో కలిసి వచ్చారు. ఇక ఈ షోలోనే బాలకృష్ణ 'స్పిరిట్' గురించి సందీప్ ని ప్రశ్నించారు. దర్శకుడు బదులిస్తూ.. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలియజేశారు. ఇక ఇదే షోలో ఉన్న రణబీర్.. ఆ సినిమాలో తనకి ఒక చిన్న ఛాన్స్ ఉన్నా ఇవ్వమని, ప్రభాస్ అన్నతో కలిసి నటించాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇక సందీప్ ఇచ్చిన సమాధానంతో.. స్పిరిట్ మూవీ 2025లో ఆడియన్స్ ముందుకు రానుందని ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ వార్త తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఈ వార్తతో నిరాశ చెందుతున్నారు. సందీప్ వంగా అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 2025 వరకు స్పిరిట్ తోనే ఉంటే, అల్లు అర్జున్ మూవీ చూడాలంటే.. 2026 వరకు ఆగాల్సిందేనా అంటూ బాధపడుతున్నారు.
Next Story