Mon Dec 23 2024 12:20:08 GMT+0000 (Coordinated Universal Time)
Allu Arjun : 'అర్జున్ రెడ్డి' బన్నీతో తీద్దాం అనుకున్నా.. సందీప్ వంగ
'అర్జున్ రెడ్డి' అల్లు అర్జున్తో తియ్యాల్సిందట. కానీ..
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో నేషనల్ వైడ్ ఫేమ్ ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం బన్నీ 'పుష్ప 2'లో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత త్రివిక్రమ్, సందీప్ వంగతో సినిమాలు చేయనున్నారు. అల్లు అర్జున్ అభిమానులంతా సందీప్ వంగ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా ఈ దర్శకుడు 'యానిమల్' సినిమాతో ఇండియన్ సినిమాని షేర్ చేశారు.
తన మేకింగ్ స్టైల్ తో ఆడియన్స్ ని మాత్రమే కాదు ఇండస్ట్రీలోని వారి మైండ్ కూడా బ్లాక్ అయ్యేలా చేశారు. అయితే ఈ సినిమాతోనే కాదు, సందీప్ వంగ తన మొదటి సినిమా అర్జున్ రెడ్డితో కూడా అలాంటి వైబ్రేషన్సే ఇచ్చారు. విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన ఈ చిత్రం.. ఒక పాత్ బ్రేకింగ్ మూవీగా నిలిచింది. ఇక అదే చిత్రం బాలీవుడ్ లో కూడా రీమేక్ చేసి సందీప్ వంగ సంచలనం సృష్టించారు. అయితే అర్జున్ రెడ్డి చిత్రాన్ని అసలు అల్లు అర్జున్ తో తియ్యల్సిందట. ఈ విషయాన్ని రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సందీప్ వంగ తెలియజేసారు.
అర్జున్ రెడ్డి కథ రాసుకోక ముందు అల్లు అర్జున్ కలిసి సందీప్ వంగ ఓ కథ వినిపించారట. అయితే ఆ సినిమా కొన్ని కారణాలు వల్ల పట్టాలు ఎక్కలేదట. ఆ తరువాత అర్జున్ రెడ్డిని రాసుకున్నారట. ఆ చిత్రాన్ని కూడా బన్నీతోనే తియ్యాలని భావించి.. ఆయనకి కథ వినిపించడానికి ప్రయత్నించారట, కానీ కుదరలేదు. ఆ తరువాత చాలామంది హీరోలకు, నిర్మాతలకు కథ చెప్పినా వర్క్ అవ్వలేదు.
దీంతో సందీప్ వంగ నిర్మాతగా మారి ఆ చిత్రాన్ని విజయ్ తో తెరకెక్కించారు. విజయ్ దేవరకొండని ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా సందీప్ వంగ కలిశారట. అయితే అప్పుడు అల్లు అర్జున్ సినిమా చేయడం మిస్ అయ్యినా ఇప్పుడు కుదిరింది. దేనికైనా టైం రావాలి అంటూ సందీప్ వంగ కామెంట్స్ చేశారు.
Next Story