Mon Dec 23 2024 19:26:30 GMT+0000 (Coordinated Universal Time)
Mahesh Babu : మహేష్ బాబుతో 'డెవిల్' మూవీ చేయాల్సింది.. సందీప్ వంగా
సందీప్ వంగా, మహేష్ బాబుతో 'డెవిల్' అనే మూవీ చేయాల్సిందట. కానీ ఏమైంది..?
Mahesh Babu : అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక సినిమా రాబోతుందంటూ గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సందీప్ వంగా కూడా ఈ విషయాన్ని ఆ సమయంలో దృవీకరించారు. అలాంటిది మహేష్ తో కాకుండా బాలీవుడ్ వెళ్లి రణబీర్ కపూర్ తో 'యానిమల్' మూవీ చిత్రీకరించారు. అయితే యానిమల్ స్టోరీనే మహేష్ బాబు రిజెక్ట్ చేయడంతో సందీప్ రణబీర్ తో తీశారని టాక్ వినిపిస్తుంది.
ఇక ఈ విషయం గురించి సందీప్ ఒక క్లారిటీ ఇచ్చారు. యానిమల్ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న సందీప్ వంగా రీసెంట్ గా హైదరాబాద్ లో ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విలేకర్లు మహేష్ మూవీ గురించి ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ.. "మహేష్ గారికి చెప్పింది యానిమల్ కథ కాదండి. అది 'డెవిల్' మూవీ. ఆ సినిమా కథ కూడా యానిమల్ తరహాలోనే ఉంటుంది. కాకపోతే యానిమల్ మూవీలోని హీరో పాత్ర కంటే డెవిల్ మూవీ హీరో రోల్ చాలా వైల్డ్ గా ఉంటుంది" అంటూ పేర్కొన్నారు.
"ఆ సినిమా కథ మహేష్ గారికి నచ్చింది. ఆయన అది రిజెక్ట్ చేయలేదు. కానీ కొన్ని కారణాలు వలన షూటింగ్ వెళ్ళలేదు అంతే. భవిషత్తులో ఆ సినిమాని తప్పకుండా సెట్స్ పైకి తీసుకు వెళ్తాను" అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఆ డెవిల్ మూవీ త్వరలో పట్టాలు ఎక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.
కాగా మహేష్ ప్రస్తుతం 'గుంటూరు కారం' చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత రాజమౌళితో SSMB29 సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా పూర్తి అయ్యేసరికి దాదాపు మూడేళ్ళ సమయం పట్టొచ్చు. నిన్న జరిగిన యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి కూడా పాల్గొనడంతో SSMB29 గురించి ఏమన్నా అప్డేట్ వస్తుందేమో అని ఎదురు చూశారు. దాని గురించి యాంకర్ సుమ ప్రశ్నించినప్పటికీ.. రాజమౌళి, మహేష్ ఇప్పుడేమి చెప్పలేము, ఇంకా సమయం ఉందంటూ బదులిచ్చారు.
Next Story