Mon Dec 23 2024 12:30:33 GMT+0000 (Coordinated Universal Time)
Allu Arjun : నేషనల్ అవార్డు బన్నీకే ఎందుకు.. దర్శకుడు వైరల్ కామెంట్స్..
అల్లు అర్జున్‌కి వచ్చిన నేషనల్ అవార్డుపై దర్శకుడు సందీప్ వంగా వైరల్ కామెంట్స్. అంతకుముందు ఉన్న హీరోలకు ఎందుకు రాలేదంటూ..
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. 69వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. 69 ఏళ్ళగా ఉత్తమ నటుడు అవార్డు అనేది తెలుగువారికీ ఒక తీరని కలలా మిగిలిపోయింది. అలాంటి దానిని ఈ ఏడాది అల్లు అర్జున్ అందుకొని.. తెలుగులో ఫస్ట్ నేషనల్ అవార్డు అందుకున్న హీరోగా చరిత్ర సృష్టించారు. ఇన్నేళ్ల తరువాత తెలుగువారి కల నెరవేరిందని కొందరు ఆనందిస్తుంటే, కొంతమంది మాత్రం కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు.
అల్లు అర్జున్ కి ముందు తెలుగుతెరపై ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, తదితరులు గొప్ప నటులు ఉన్నారు. తమ కెరీర్లో విమర్శకుల ప్రశంసలు అందుకునే సినిమాలు ఎన్నో చేశారు. కానీ వారి ఎవ్వరికీ రాని అవార్డు ఇప్పుడు వచ్చిందా..? అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. కొందరు ఈ ప్రశ్నలు వేస్తూనే, జవాబులు కూడా వారే చెప్పేస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే చిన్న చూపు ఉండేదని, ఇప్పుడు టాలీవుడ్ ఇండియన్ సినిమాని ఏలుతుంది కాబట్టి అవార్డు ఇచ్చారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ వంగా కూడా ఇలాంటి ప్రశ్నే వేసి తానే జవాబు కూడా ఇచ్చేశారు. ప్రస్తుతం 'యానిమల్' మూవీ ప్రమోషన్స్ లో ఉన్న సందీప్ వంగాని తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గురించి ప్రశ్నించారు. సందీప్ వంగా కామెంట్స్.. "అల్లు అర్జున్ గారికి వచ్చినందుకు నాకు సంతోషమే. కానీ ఇన్నాళ్లు ఎవరికి ఎందుకు రాలేదు. ఎవరు అప్లై చేయలేదా..?" అంటూ ముందుగా క్యూస్షన్ చేశారు.
ఆ తరువాత దానికి ఆయనే ఇలా సమాధానం ఇచ్చుకున్నారు.. "నాకు అనిపిస్తుంది ఏంటంటే, మనవాళ్ళు నేషనల్ అవార్డుని పెద్దగా సీరియస్ గా తీసుకోని ఉండరు. అందుకనే అప్లై చేసి ఉండరు" అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా అల్లు అర్జున్ తో సందీప్ వంగా ఒక సినిమా చేయనున్నారు. యానిమల్ రిలీజ్ తరువాత ప్రభాస్ తో 'స్పిరిట్' పూర్తి చేసి అల్లు అర్జున్ తో సందీప్ వంగా సినిమా స్టార్ట్ చేయనున్నారు.
Next Story