భయపడాలంటే.. ఆ మాత్రం ఉండాలి!!
కెజిఎఫ్ సినిమాలో రాఖి భాయ్ గా హీరో యశ్ ని ఊర మాస్ గా చూపించాడు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. హీరో యాష్.. కానీ ఆ [more]
కెజిఎఫ్ సినిమాలో రాఖి భాయ్ గా హీరో యశ్ ని ఊర మాస్ గా చూపించాడు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. హీరో యాష్.. కానీ ఆ [more]
కెజిఎఫ్ సినిమాలో రాఖి భాయ్ గా హీరో యశ్ ని ఊర మాస్ గా చూపించాడు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. హీరో యాష్.. కానీ ఆ సినిమాలో విలన్ లెక్క యశ్ ని చూపించాడు. యశ్ ని అలా కెజిఎఫ్ లో చూసాక కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ పై తెలుగు హీరోలు మనసు పారేసుకున్నారు. కెజిఎఫ్ కి సీక్వెల్ గా కెజిఎఫ్ ని భారీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో క్లైమాక్స్ లో రాఖి భాయ్ పాత్ర చనిపోతుందని…. కెజిఎఫ్ లో యశ్ పాత్రకి సీక్వెల్ లో యాష్ కి అస్సలు ఫోలిక్ ఉడదని.. యశ్ ని అంత మాస్ గా చూపించబోతున్నాడు అని అంటున్నారు. మరి నిన్నగాక మొన్న విడుదలైన అధీరా సంజయ్ దత్ విలనీ లుక్ చూస్తే ఈ సినిమా ఎలా ఉండబోతుందో అర్ధమవుతుంది.
అయితే అధిరాని చూడగానే భయపడాలని, అందుకే అధీర లుక్ ని అలా టాటూలు, పెద్ద జడతో డిజైన్ చేసినట్లుగా చిత్ర బృందం చెబుతున్న మాట. సంజయ్ దత్ అధీరా లుక్ చూడగానే అమ్మో అనిపించేలా ఉండి ఆహార్యం, ఆయన బాడీ. అయితే అధీరా లుక్ ని వైకింగ్స్ స్పూర్తితో డిజైన్ చేసినట్లు గా కెజిఎఫ్ యూనిట్ తాజాగా రివీల్ చేసింది. అధీని చూడగానే ప్రేక్షకులు భయపడేలా ఉండాలనేది ప్రశాంత్ నీల్ ఆలోచనట. అందుకే సంజయ్ లుక్ కోసం వైకింగ్స్ లుక్ స్ఫూర్తిగా తీసుకున్నారట. సంజయ్ దత్ సినిమాలో చాలా క్రూరంగా కనిపిస్తాడని, సంజయ్ దత్ విలనిజం సినిమాకే హైలెట్ అని, రాఖి భాయ్ గా యశ్ కి ఎంత పేరొస్తుందో అంతే పేరు సంజయ్ దత్ కి రావడం పక్కా అని చెబుతున్నారు. మరి నిజంగానే అధీరగా సంజయ్ లుక్ చూసాక ఆ పాత్రలోని పవర్ ఫుల్ విలనిజం, అలాగే లుక్ చూసాక ఆ పాత్రపై పిచ్చ ఇంట్రెస్ట్ కలుగుతుంది.