Mon Dec 15 2025 06:26:08 GMT+0000 (Coordinated Universal Time)
శంకరాభరణం చిత్రానికి అరుదైన గౌరవం
ప్రతి సంవత్సరం జరిగే అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవ వేడుకల్లో ఒకప్పటి క్లాసిక్ సినిమాలను డిజిటలైట్ చేసి..

గోవాలో నవంబర్ 20న ప్రారంభమైన 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో తెలుగు ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ అయిన శంకరా భరణం సినిమాకి అరుదైన గౌరవం దక్కింది. ప్రతి సంవత్సరం జరిగే అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవ వేడుకల్లో ఒకప్పటి క్లాసిక్ సినిమాలను డిజిటలైట్ చేసి.. Restored Indian Classics విభాగంలో భద్రపరుస్తారు. ఈ ఏడాది 53వ IFFI – 2022లో ఈ విభాగంలో National Film Archives of India వారు మన తెలుగు ఆల్ టైం క్లాసిక్ మూవీ శంకరాభరణం ఎంపికైంది.
కళా తపస్వి శ్రీ. కే. విశ్వనాధ్ దర్శకత్వంలో పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై ఏడిద నాగేశ్వరావు నిర్మాణంలో సోమయాజులు ముఖ్యపాత్రలో తెరకెక్కిన ఈ సినిమా 1980లో విడుదలై భారీ విజయం సాధించి.. ఎన్నో అవార్డులు అందుకుంది. ఈ సినిమాని చిత్రోత్సవాల్లో ప్రత్యేక ప్రదర్శన కూడా వేయనున్నారు. ఈ ప్రదర్శనకు చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరావు కుమారుడు ఏడిద రాజా ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు.
Next Story

