Sun Dec 22 2024 21:34:33 GMT+0000 (Coordinated Universal Time)
Sankranthi Movies : సంక్రాంతి సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత..?
ఈ సంక్రాంతికి మొత్తం నాలుగు సినిమాలు రాబోతున్నాయి. మరి వాటిలో ఏ సినిమా ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందో చూసేయండి.
Sankranthi Movies : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండక్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా తెలుగు సినిమాలకు అయితే సంక్రాంతి అంటే ఒక గొప్ప అవకాశంగా చూస్తారు. దీంతో ఆ సమయంలో చిన్న, పెద్ద సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుంటాయి. ఈక్రమంలోనే ఈ ఏడాది టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బరిలో మొత్తం నాలుగు సినిమాలు పోటీకి దిగుతున్నాయి. మరి వాటిలో ఏ సినిమా ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందో చూసేయండి.
గుంటూరు కారం..
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'గుంటూరు కారం' జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ దాదాపు 135 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.
హనుమాన్..
ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కలయికలో వస్తున్న సూపర్ హీరో మూవీ 'హనుమాన్' కూడా జనవరి 12నే రిలీజ్ కానుంది. హీరోగా మూడు సినిమాల బ్యాక్గ్రౌండే ఉన్నపటికీ.. హనుమంతుడి కథ నేపథ్యం కావడంతో ఈ చిత్రం నార్త్ లో మంచి ఆసక్తిని అందుకుంది. దీంతో చిన్న హీరో సినిమా అయినా 25 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
సైంధవ్..
శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వెంకటేష్ 75వ చిత్రం 'సైంధవ్' జనవరి 13న రిలీజ్ కాబోతుంది. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 25 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం.
నా సామిరంగ..
నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న 'నా సామిరంగ' జనవరి 14న విడుదల కాబోతుంది. మలయాళ మూవీకి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రం 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.
Next Story