Sat Jan 11 2025 16:49:36 GMT+0000 (Coordinated Universal Time)
స్క్రిప్ట్ రైటర్ గా మారిన పోలీసు అధికారి.. ఎవరూ చూడని పోలీసు కథతో
పోలీసుగా విధులు నిర్వర్తిస్తూ ఉన్నా కూడా.. తాను ఎప్పుడూ రాయడంపై మక్కువ చూపుతూ ఉంటానని తెలిపారు.
జీవితంలోని వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు దర్శకులుగా, రైటర్లుగా మారిన ఘటనలను చాలానే చూశాం. ఆ లిస్టులో మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంతోష్ మెహ్రా కూడా ఉన్నారు. ఆయన స్క్రీన్ రైటర్గా మారిపోయారు. పోలీసుగా 35 ఏళ్లపాటు వివిధ హోదాల్లో ప్రజలకు సేవ చేసిన తర్వాత, మెహ్రా ఇప్పుడు పాన్-ఇండియా కాప్ చిత్రానికి కథను రాశారు. ఆయన ఈ కథను రూపొందించడానికి అతను తన స్వంత అనుభవాలు మాత్రమే కాకుండా తన సహచరుల అనుభవాల గురించి కూడా తెలుసుకున్నామని తెలిపారు.
పోలీసుగా విధులు నిర్వర్తిస్తూ ఉన్నా కూడా.. తాను ఎప్పుడూ రాయడంపై మక్కువ చూపుతూ ఉంటానని తెలిపారు. పోలీసుల్లో ఎంతో మంది హీరోలు ఉన్నారని.. అటువంటి హీరోల గురించి తాను రాసేవాడినని చెప్పారు. ఈ చిత్రం సింగం, దబాంగ్లో లాగా హీరో గూండాలను కొట్టే సాధారణ మసాలా కథ కాదని ఆయన చెప్పారు. "విధి నిర్వహణలో నిజాయితీగా ఉండే వ్యక్తికి సంబంధించిన కథ. వారి సేవలకు తగినంత గుర్తింపు రాకవచ్చు, కానీ వారు చేసే పనిలో యూనిఫాం పట్ల వారి చిత్తశుద్ధి, గౌరవం కనపడుతూనే ఉంటుంది" అని మెహ్రా చెప్పుకొచ్చారు.
ఏమీ ఆశించకుండా నిస్వార్థ సేవ చేసే అట్టడుగు స్థాయి పోలీసులను కూడా తాను కలిశానని తెలిపారు. మెహ్రా 1987 బ్యాచ్ IPS అధికారి. UN శాంతి పరిరక్షక మిషన్లో లైజన్ ఆఫీసర్గా కీలక పాత్ర పోషించారు. తెలుగు రాష్ట్రాల నుండి హాట్ స్ప్రింగ్స్ ప్రతినిధి బృందానికి టీమ్ లీడర్గా పనిచేసిన ఏకైక IPS అధికారి. "చాలా మంది చిత్రనిర్మాతలు నాకు స్నేహితులు. మేము తరచుగా మాట్లాడుకుంటూ ఉంటాం. నాకు అపారమైన అనుభవం ఉండడంతో, చిత్రనిర్మాతలలో ఒకరు నన్ను సంప్రదించారు, పోలీసు కథను వ్రాయమని చెప్పారు." అని అన్నారు. అందుకు తగ్గట్టుగా ఓ మంచి కథను తీసుకుని వస్తున్నట్లు మెహ్రా తెలిపారు.
Next Story