Tue Nov 05 2024 19:42:53 GMT+0000 (Coordinated Universal Time)
శరత్ బాబు ఆస్తులు ఎవరికి ?
ఆయనకు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఎంతో విలువైన ఆస్తులు ఉన్నాయి. మాల్స్, విల్లాలు కూడా..
దశాబ్దాల కాలం పాటు 200కి పైగా సినిమాల్లో నటించిన సీనియర్ నటుడు శరత్ బాబు మే 22న హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి చెందారు. అయితే.. శరత్ బాబు ఆస్పత్రిలో చేరినప్పటి నుండి ఆయన ఆస్తులపై చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆయన లేకపోవడంతో.. ఆయన ఆస్తులు ఎవరికి చెందుతాయన్న ఆసక్తికర చర్చ నడుస్తోంది. శరత్ బాబుకు రెండుసార్లు పెళ్లి అవ్వగా.. ఇద్దరు భార్యలతోనూ విడాకులు తీసుకున్నారు. ఆయన వారసులు లేరు. 8 మంది అన్నదమ్ములు, ఐదుగురు అక్కచెల్లెళ్లలో శరత్ బాబు మూడవవాడు. పెద్దన్నయ్య కొన్నేళ్ల క్రితమే చనిపోయాడు.
ఆ తర్వాత అక్క చెల్లెళ్లందరి బాధ్యత శరత్ బాబే చూసుకునేవాడు. అన్నదమ్ముల పిల్లల్ని తన పిల్లలుగా చేరదీశాడు. ఆయనకు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఎంతో విలువైన ఆస్తులు ఉన్నాయి. మాల్స్, విల్లాలు కూడా ఆయన పేరు మీద ఉన్నట్టు చెబుతున్నారు. ఈ ఆస్తుల పంపకంపై ఆయన తమ్ముడు మధు మాట్లాడుతూ.. ఇలాంటి సమయంలో ఆస్తుల పంపకం గురించి మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డారు. ఆయన విల్లు ఎలా రాస్తే, ఎవరికి రాస్తే వారికే ఆస్తులు చెందుతాయని చెప్పారు. అన్న ఆస్తి కోసం తాము తగువులాడుకోమని, తమది ఉమ్మడి కుటుంబమని, ఏం చేయాలో తమకు తెలుసని అన్నారు. 12వ రోజు పూర్తయిన తర్వాత లాకర్లు తెరిచి చూస్తామని.. విల్లులో రాసిన దాని ప్రకారమే పంపకాలు జరుగుతాయన్నారు. ఒకవేళ వీలునామా రాయకపోతే.. ఆస్తులను ఏం చేయాలనేది కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తమ అన్నయ్య విల్లులో ఒకరికి ఆస్తులిచ్చి, మరొకరికి ఇవ్వకపోయినా ఏమీ అనుకోమని అన్నారు.
Next Story