సర్కార్ స్టోరీ లీక్..!
విజయ్ - మురుగదాస్ కలయికలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న సర్కార్ సినిమాపై కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోను భారీ అంచనాలున్నాయి. మురుగదాస్ డైరెక్షన్ విజయ్ నటనతో ఆ కాంబోలో తెరకెక్కిన సినెమాలల్నీ బ్లాక్ బస్టర్స్ కావడమే సర్కార్ మీద అంత భారీగా అంచనాలు పెరగడానికి కారణం. ఇక విజయ్ తుపాకీ సినిమా నుండి తన ప్రతి సినిమాని తెలుగులో డబ్ చేసుకుంటూ తెలుగు ప్రేక్షకుల దగ్గర మంచి మర్కెట్ సంపాదించాడు. కాకపోతే విజయ్ కత్తిని రీమేక్ కోసమే టాలీవడ్ పెద్దలు ఇక్కడ డబ్ కానివ్వలేదు. ఇక ఇప్పుడు సర్కార్ మీద టాలీవుడ్ పెద్దల కన్ను ఉన్నప్పటికీ.. విజయ్ - మురుగదాస్ లు మాత్రమ్స్ సర్కార్ ని కోలీవుడ్ లో విడుదల సమయానికే అంటే దిపావళికే తెలుగులోనూ విడుదల చేసే ఏర్పాట్లు చేస్తున్నారు.
బిజినెస్ మెన్ గా...
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కలెక్టర్ పాత్రలో నటిస్తుంది. అయితే తాజాగా సర్కార్ కథ గురించి ఒక న్యూస్ సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మరి సర్కార్ టీజర్ లో చూపించినట్టుగా ఈ చిత్రంలో విజయ్ ఒక ఎన్ఆర్ఐ. పెద్ద వ్యాపారవేత్త అయిన విజయ్ ఏదైనా సరే పోటీ లేకుండా ఉండటం కోసం.. అవతలి వస్తువుని స్వాధీనం చేసుకునేంత వరకు నిద్రపోని రకం. ఆ పట్టుదల, అకుంఠిత దీక్షే విజయ్ ని సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ ని చేస్తుంది. అయితే తన రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో తన ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు ఇండియా వస్తాడు. అయితే విజయ్ పేరు మీదున్న ఓటు హక్కును నకిలీ వ్యక్తి వినియోగించేసుకుంటాడు. తన ఓటు హక్కు కోసం విజయ్ కోర్టుకు వెళతాడు. ఇక విజయ్ కి అనుకూలంగా కోర్టు తీర్పు రావడమే కాదు మళ్లీ ఆ నియోజక వర్గానికి ఎన్నికలు పెట్టాలని తీర్పునిస్తుంది.
కథ ఇదేనా..?
అయితే తన ఓటు కోసం కోర్టుకెళ్లిన విజయ్ వైఖరి సీఎం రాధారవికి, భవిష్యత్తు నాయకురాలిగా కలలు కంటున్న కలెక్టర్ వరలక్ష్మి రుచించదు. అనూహ్యంగా జరిగిన రాజకీయ పరిణామాల వల్ల విజయ్ సిఎంగా మారే పరిస్థితి వస్తుంది. కానీ విజయ్ సీఎం పీఠాన్ని అధిష్ఠిస్తాడా... లేదంటే తెరవెనుక ఉంది కథ నడిపిస్తాడా... అనేది మాత్రం సర్కార్ కథలోని సస్పెన్స్ అంటున్నారు. మరి ఇదే కథ అయితే మురుగదాస్ మార్క్ డైరెక్షన్ తోడైతే సినిమా అదుర్స్ అంటున్నారు విజయ్ ఫాన్స్. ఈ దీపావళికి విజయ్ సర్కార్ వరల్డ్ వైడ్ గా విడుదలకబోతుంది.