Mon Dec 23 2024 12:06:49 GMT+0000 (Coordinated Universal Time)
యూట్యూబ్ ను షేక్ చేసిన సితార-మహేష్.. 24 గంటల్లో ఆల్ టైం రికార్డు
బ్యాంకు స్కాం నేపథ్యంలో తెరకెక్కిన సర్కారు వారి పాట చిత్రం సారాంశం అంతా ఈ పాటలోనే ఉండడంతో ఫ్యాన్స్ ను విశేషంగా..
హైదరాబాద్ : మహేష్ బాబు నటించిన సర్కారువారి పాట సినిమా నుంచి నిన్న పెన్నీ సాంగ్ లిరికల్ వీడియో విడుదలైంది. పాట విడుదలై 24 గంటలు అయిందో లేదో.. ఆల్ టైం రికార్డును సెట్ చేసింది. తండ్రి - కూతురు కలిసి స్టెప్పులేయడంతో సూపర్ స్టార్ అభిమానులు ఫుల్ జోష్ మీద ఉన్నారు. కేవలం 24 గంటల్లో 1.8 కోట్ల వ్యూస్ తో ఆల్ టైమ్ రికార్డు అందుకుంది. ఈ మేరకు జీఎంబీ ఎంటర్టైన్ మెంట్స్ సంస్థ ట్వీట్ చేసింది.
బ్యాంకు స్కాం నేపథ్యంలో తెరకెక్కిన సర్కారు వారి పాట చిత్రం సారాంశం అంతా ఈ పాటలోనే ఉండడంతో ఫ్యాన్స్ ను విశేషంగా అలరిస్తోంది. పెన్నీ సాంగ్ లో సితార స్టెప్పులు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటకు తమన్ సంగీతాన్ని అందించారు. టెక్నో పాప్ స్టైల్లో ఉన్న ఈ పాటకు.. సితా పాప కూడా లయబద్ధంగా స్టెప్పులేసింది. పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లపై రూపుదిద్దుకున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
News Summary - Sarkarivari Pata Penny Song Sets All Time Record Views in Youtube ; Mahesh and Sithara Rocked
Next Story