Mon Dec 23 2024 13:17:23 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలో 'సర్కారు వారి పాట' వచ్చేసింది
ప్రైమ్ వీడియోలో ఎర్లీ యాక్సెస్ రెంటల్స్ ద్వారా చిత్రం డిజిటల్ విడుదల గురించి మహేష్ బాబు మాట్లాడుతూ
మహేశ్ బాబు, కీర్తీ సురేశ్ జంటగా నటించిన 'సర్కారువారి పాట' చిత్రం మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సత్తా చాటింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సముద్రఖని, సుబ్బరాజు, వెన్నెల కిశోర్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్, 14 రీల్స్ ప్లస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ లో సందడి చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలయింది. ఈ చిత్రాన్ని ప్రైమ్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఉచితంగా చూసే వీలు లేదు. రూ. 199 చెల్లించి ఈ సినిమాను చూడాల్సి ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ చందాదారులు డబ్బులు చెల్లించి చూడాలి.
సర్కారు వారి పాట ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రూ. 199కి 'ఎర్లీ యాక్సెస్' రెంటల్స్‌కు అందుబాటులో ఉంది. ప్రైమ్ వీడియోలో కొత్తగా ప్రారంభించిన 'మూవీ రెంటల్స్'తో డిజిటల్ సబ్‌స్క్రిప్షన్‌కు ముందు సినిమాకి ముందస్తు యాక్సెస్‌ను పొందవచ్చు. KGF: చాప్టర్ 2, రన్‌వే 34 వంటి చిత్రాల తర్వాత, ప్రైమ్ వీడియో ముందస్తు యాక్సెస్ రెంటల్స్ ద్వారా సర్కారు వారి పాట సినిమాను అభిమానులకు అందిస్తోంది.
ప్రైమ్ వీడియోలో ఎర్లీ యాక్సెస్ రెంటల్స్ ద్వారా చిత్రం డిజిటల్ విడుదల గురించి మహేష్ బాబు మాట్లాడుతూ, "సర్కారు వారి పాట సినిమా థ్రిల్లింగ్ రైడ్‌గా ఉంటుంది. సినిమా చూసిన ప్రేక్షకుల నుండి దక్కిన ప్రేమతో నేను ఉప్పొంగిపోయాను. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీ రెంటల్స్ ద్వారా వీక్షకులకు సినిమాని ముందస్తు యాక్సెస్ ఇవ్వడం పట్ల సంతోషిస్తున్నాను. ఈ సినిమా హాస్యం, యాక్షన్, డ్రామా, భావోద్వేగాలతో కూడిన కథ, దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు తమ ఇళ్లలో నుండి, నచ్చిన సమయంలో.. వారికి నచ్చిన పరికరంలో సినిమాను ఆస్వాదించగలరని నేను సంతోషిస్తున్నాను." అని చెప్పుకొచ్చారు.
News Summary - Watch Sarkaru Vaari Paata on Amazon Prime Video: Know cost per view, who can watch and other details
Next Story