సర్కోరోడు దిగిపోయాడు!!
మహేష్ బాబు ఫాన్స్ ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. కృష్ణగారి పుట్టిన రోజునాడు మహేష్ బాబు తన సినిమాలకు సంబందించిన ఎదో ఒక ప్రకటన ఇవ్వడం [more]
మహేష్ బాబు ఫాన్స్ ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. కృష్ణగారి పుట్టిన రోజునాడు మహేష్ బాబు తన సినిమాలకు సంబందించిన ఎదో ఒక ప్రకటన ఇవ్వడం [more]
మహేష్ బాబు ఫాన్స్ ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. కృష్ణగారి పుట్టిన రోజునాడు మహేష్ బాబు తన సినిమాలకు సంబందించిన ఎదో ఒక ప్రకటన ఇవ్వడం ఆనవాయితీగా మారింది. ముందునుండి అనుకున్నట్టుగానే మహేష్ బాబు కొత్త సినిమా ఎనౌన్సమెంట్ వచ్చేసింది. సరిలేరు నీకెవ్వరూ సినిమా హిట్ తర్వాత మహేష్ సినిమా ఏమిటనే దాని మీద పిచ్చ ఆసక్తిగా మారింది. కారణం వంశి పైడిపల్లి మూవీ అనుకున్న మహేష్ ఫాన్స్ కి మహేష్ షాకిచ్చాడు. తర్వాత గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో సినిమా అంటూ ప్రహకారం జరగడం మహేష్ కన్ఫర్మ్ చెయ్యకుండా కన్ఫ్యూజన్ లో పెట్టడం.. గత వారం రోజులుగా పరశురామ్ – మహేష్ మూవీ పై సోషల్ మీడియాలో వార్తలు రావడంతో మహేష్ ఫాన్స్ పిచ్చ క్యూరియాసిటీగా ఉన్నారు.
ఇక మహేష్ ఎప్పటిలాగే తండ్రి కృష్ణ పుట్టిన రోజున ఎమోషనల్ గా ట్వీట్ చేసి విషెస్ చెప్పడమే కాదు.. తన కొత్త సినిమా టైటిల్ పోస్టర్ ని విడుదల చేసాడు. పరశురామ్ తో మహేష్ సర్కారు వారి పాట అనే టైటిల్ తో సినిమా మొదలెడుతున్నాడు. ముందు నుండి ప్రచారం జరిగినట్టుగానే మహేష్ సర్కారు వారి పాట టైటిల్ తో రంగంలోకి దిగిపోయాడు. మహేష్ బాబు ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడా అనేది జస్ట్ కనిపించి కనిపించని లుక్ తో టైటిల్ వదిలారు. కాకపోతే మహేష్ తాజాగా లాక్ డౌన్ వర్కౌట్స్ చూస్తే కొత్త లుక్ లోనే కనిపిస్తాడని ఫిక్స్ అవ్వొచ్చు. బట్ సర్కారు వారి పాట టైటిల్ లో మహేష్ నెక్ బ్యాక్ లుక్ మాత్రం అంతగా అనిపించడం లేదు. చెవికి పోగు, హెయిర్ స్టయిల్ అన్ని కొత్తగా కనిపిస్తున్నప్పటికీ.. మహేష్ లుక్ పూర్తిగా రివీల్ అయితే ఎక్కడో తేడా కొడుతుందేమో అనే ఫీలింగ్ వస్తుంది. మరి మహేష్ సర్కారు వారి పాట పూర్తి లుక్ వచ్చాక దాని మీద డిస్కషన్ పెడదాం.