Mon Dec 23 2024 13:30:40 GMT+0000 (Coordinated Universal Time)
సర్కారు వారి పాట కలెక్షన్స్ వివరాలు ఇవే..!
తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.36.36 కోట్ల కలెక్షన్స్ వసూల్ చేసిన సర్కారు వారి పాట సినిమా.. రెండో రోజు కూడా అదే జోష్‌ను
హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా 'సర్కారు వారి పాట' తొలిరోజు 36.63 కోట్ల షేర్ రాబట్టగా.. రెండో రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 11.64 కోట్ల షేర్ రాబట్టింది. రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ 48.27 కోట్ల రూపాయలకు చేరాయి. అమెరికాలో సర్కారు వారి పాట 1.5 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి వీకెండ్ అడ్వాంటేజ్ గా మారనుంది. మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఇక శని, ఆదివారాల్లో బుకింగ్స్ భారీగా ఉన్నాయి.
తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.36.36 కోట్ల కలెక్షన్స్ వసూల్ చేసిన సర్కారు వారి పాట సినిమా.. రెండో రోజు కూడా అదే జోష్‌ను కనబరిచింది. శుక్రవారం 'సర్కారు వారి పాట' సినిమా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి రూ.11.64 కోట్లను వసూలు చేసింది. నైజాంలో రూ.5.2 కోట్లు, సీడెడ్ 1.45 కోట్లు, ఉత్తరాంధ్ర 1.65 కోట్లు, ఈస్ట్ 1.08 కోట్లు, వెస్ట్ 45 లక్షలు, గుంటూరు 51 లక్షలు, కృష్ణ 89 లక్షలు, నెల్లూరులో 41 లక్షను వసూలు చేసింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో రూ.48.27 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కారు వారి పాట' సినిమాను జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన కీర్తి సురేశ్ నటించారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో సముద్రఖని, నదియా, వెన్నెల కిశోర్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Next Story