మోడ్రెన్ రైతు గా శర్వా!
శర్వా బర్త్ డే ట్రీట్ గా ఒకరోజు ముందే శర్వానంద్ నటించిన శ్రీకారం ట్రైలర్ వదిలింది టీం. ఆ ట్రైలర్ లో సిటీ లో క్లాస్ గా [more]
శర్వా బర్త్ డే ట్రీట్ గా ఒకరోజు ముందే శర్వానంద్ నటించిన శ్రీకారం ట్రైలర్ వదిలింది టీం. ఆ ట్రైలర్ లో సిటీ లో క్లాస్ గా [more]
శర్వా బర్త్ డే ట్రీట్ గా ఒకరోజు ముందే శర్వానంద్ నటించిన శ్రీకారం ట్రైలర్ వదిలింది టీం. ఆ ట్రైలర్ లో సిటీ లో క్లాస్ గా సాఫ్ట్ వెర్ చేసుకునే కుర్రాడు వ్యవసాయం చేస్తా అంటూ పల్లెటూరికి వెళ్లి అక్కడ రైతులా లుంగీ కట్టి ట్రాక్టర్ ఎక్కితే అందులో ఉండే ఆనందమే వేరు అంటాడు హీరో శర్వానంద్. ప్రొక్లైన్ ఎక్కి.. మట్టి తవ్వుతూ.. చేతిలో పార పట్టుకుని వస్తానంటివో.. నువ్వు వస్తానంటివో అంటూ హీరోయిన్ ప్రియాంకతో పాటేసుకుని.. ఆ పల్లెటూరిలో లోకల్ గా వుండే విలన్ సాయి కుమార్ ని ఎదుర్కుంటూ హీరో వ్యవసాయం ఎలా చేసాడన్నది ఈ శ్రీకారం సినిమా కథ అనేది రీసెంట్ గా విడుదలైన శ్రీకారం ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.
శ్రీకారం శర్వానంద్ క్లాస్ అండ్ రైతు లుక్స్ అన్ని సూపర్బ్ అనేలా ఉన్నాయి. ఇక హీరోయిన్ ప్రియాంక గ్లామర్ గా బావుంది. సాయి కుమార్ యంగ్ విలన్ అవతారంలో మెప్పిస్తున్నాడు. రావు రమేష్ బరువైన రైతు పాత్రని మోస్తున్నాడు. కొన్ని చూసి నేర్చుకోవాలి, కొన్ని చేసి నేర్చుకోవాలి అంటూ భారమైన డైలాగ్స్ తో రావు రమేష్ పాత్ర కనబడుతుంది. ఇక సీనియర్ నరేశ్.. పక్క పొలం వాళ్లతో గొడవ పడుతుంటే.. చిలికి చిలికి గాలి వానైనట్లు.. గొడవలు ముదిరి గట్లేసుకునే వరకు వచ్చింది అంటూ బ్యాగ్ రౌండ్ లో చెబుతున్న డైలాగ్ బావుంది. సత్య కామెడీ, వ్యవసాయం అంటే పేకాట వ్యాపారం అయ్యిపోయింది అంటూ రైతులు పడే కష్టాలను తీర్చే రైతు గా శర్వానంద్ కనిపిస్తున్న ఈ శ్రీకారం మహాశివరాత్రికి రిలీజ్ కాబోతుంది.