Fri Dec 20 2024 06:01:32 GMT+0000 (Coordinated Universal Time)
2023 Rewind : మెయిన్ హీరోయిన్ కంటే ఈ భామలకే ఎక్కువ క్రేజ్ వచ్చింది..
ఈ ఏడాదిలో వచ్చిన సినిమాల్లో మెయిన్ హీరోయిన్ కంటే పక్కన ముఖ్య పాత్రలు చేసిన భామలకే ఎక్కువ క్రేజ్ వచ్చింది. ఆ భామలు ఎవరో..
2023 Rewind : ఈ ఏడాదిలో వచ్చిన సినిమాల్లో మెయిన్ హీరోయిన్ కంటే పక్కన ముఖ్య పాత్రలు చేసిన భామలకే ఎక్కువ క్రేజ్ వచ్చింది. యూత్ అంతా అసలు హీరోయిన్ ని పక్కన పెట్టేసి.. ఈ ముద్దుగుమ్మలకు మనసు ఇచ్చేస్తున్నారు. మరి ఆ భామలు ఎవరో ఓ లుక్ వేసేయండి.
త్రిప్తి దిమ్రీ..
సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన బోల్డ్ అండ్ వైలెంట్ ఫిలిం 'యానిమల్'. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ చిత్రంతో బాలీవుడ్ మంచి క్రేజ్ సంపాదించుకుందాం అని ఆశలపై.. సెకండ్ హీరోయిన్ గా నటించిన త్రిప్తి దిమ్రీ నీళ్లు చల్లినట్లు అయ్యింది.
బాలీవుడ్ లో పలు సినిమాల్లో మెయిన్ లీడ్ చేసిన రాని క్రేజ్.. త్రిప్తికి 'యానిమల్'లో సెకండ్ హీరోయిన్ గా చేస్తే వచ్చింది. సినిమాలో 'జోయా' పాత్ర చేసి అబ్బాయిల మనసు దోచుకుంది. ఈ ఏడాది అబ్బాయిల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న భామల లిస్టులో త్రిప్తిది మొదటి స్థానం అనడంలో పెద్ద సందేహం అవసరం లేదు.
శ్రియారెడ్డి..
శ్రియారెడ్డి తెలుగు సినిమా 'అప్పుడప్పుడు'తోనే పూర్తిస్థాయి నటిగా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తరువాత తమిళంలో వరుస ఛాన్సులు అందుకున్నప్పటికీ.. శర్వానంద్ 'అమ్మ చెప్పింది' సినిమాలో ముఖ్య పాత్ర చేశారు. అయితే విశాల్ హీరోగా తెరకెక్కిన 'పొగరు' సినిమాలో నెగటివ్ షెడ్ పాత్రతోనే శ్రియారెడ్డి.. అటు తమిళంలో ఇటు తెలుగులో నటిగా మంచి ఫేమ్ ని సంపాదించుకున్నారు. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ నటి.. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్లో వచ్చిన 'సుడల్' వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇచ్చారు.
ఇక ప్రభాస్ 'సలార్' మూవీలో 'రాధారమ' అనే ఓ పవర్ రోల్ చేసి తన నటనతో అందరి చేత వావ్ అనిపించుకున్నారు. నటన మాత్రమే కాదు, సినిమాలో తన లుక్స్ యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి. మూవీ శృతిహాసన్ లాంటి హీరోయిన్ ఉన్నప్పటికీ.. అబ్బాయిలు అంతా శ్రియారెడ్డికే ఫిదా అయ్యిపోయారు. దీంతో ఈ ఏడాది క్రష్ లిస్టులో.. త్రిప్తి తరువాత శ్రియాకి స్థానం ఇచ్చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో శృతిహాసన్ కంటే శ్రియా పేరే ఎక్కువ వినిపిస్తుంది.
దివ్య పిళ్లై..
ఆర్ఎక్స్100 దర్శకుడు అజయ్ భూపతి, పాయల్ రాజ్పుత్ తో తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'మంగళవారం'. ఆర్ఎక్స్100 తరువాత సరైన హిట్టు లేని పాయల్ కి ఈ మూవీ మంచి విజయం అయితే ఇచ్చింది గాని, ఆడియన్స్ లో ఫేమ్ ని మాత్రం మరో భామకి కట్టబెట్టింది. ఈ సినిమాలో జమీందారు భార్యగా మలయాళ భామ దివ్య పిళ్లై నటించింది. సినిమా మొత్తం చాలా మంచిగా కనిపించిన ఈమె పాత్ర.. చివరిలో మెయిన్ విలన్ గా మారి ఆడియన్స్ కి థ్రిల్ ఇచ్చింది.
అయితే యూత్ మాత్రం.. ఆ ట్విస్ట్ కి థ్రిల్ అవ్వలేదు. చీరలో దివ్య పిళ్లై పరువాలు ఫిదా అయ్యారు. దుబాయ్ లో పుట్టిన పెరిగిన ఈ మలయాళ భామ.. ఎయిర్ హోస్టెస్ కూడా పనిచేసింది. 2015లో 'అయల్ నంజళ్ల' అనే మలయాళ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక మంగళవారం చిత్రం తరువాత తెలుగులో ఈ భామ పేరు గట్టిగా వినిపిస్తుంది. సోషల్ మీడియాలో దివ్య క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
Next Story