Mon Dec 23 2024 11:19:26 GMT+0000 (Coordinated Universal Time)
సర్కారువారి పాట నుంచి సెకండ్ సింగిల్ !
తాజాగా సర్కారు వారి పాట నుంచి మరో సింగిల్ ను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సిద్ధమైంది. ఈ నెల 20వ తేదీన సినిమా నుంచి..
హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు - కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతోన్న సినిమా సర్కారువారి పాట. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం పూర్తి వినోదభరితంగా ఉంటుందని ఇప్పటికే టాలీవుడ్ టాక్ నడుస్తోంది. మహేష్ - కీర్తిల మధ్య చిత్రీకరించిన కళావతి పాట ఇప్పటికే విడుదల కాగా.. 90 మిలియన్ల వ్యూస్ తో నెట్టింట్లో దూసుకుపోతోంది. సోషల్ మీడియాలోనూ ఎక్కడ చూసిన కళావతి రీల్సే దర్శనమిస్తున్నాయి.
తాజాగా సర్కారు వారి పాట నుంచి మరో సింగిల్ ను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సిద్ధమైంది. ఈ నెల 20వ తేదీన సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను విడుదల చేయనున్నట్లు తెలుపుతూ.. మేకర్స్ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సముద్రఖని, వెన్నెల కిషోర్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బ్యాంక్ స్కామ్ నేపథ్యంలో ఉండనున్న ఈ సినిమాలో మహేష్ మునుపటి కంటే డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. యాక్షన్ సీన్స్ .. సాంగ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయి. మే 12వ తేదీన సర్కారువారి పాట థియేటర్లలో విడుదల కానుంది.
News Summary - Second Single from Sarkaruvari Pata on March 20th
Next Story