Sun Dec 22 2024 21:45:57 GMT+0000 (Coordinated Universal Time)
రౌడీ ఫ్యాన్స్ కోరుకునే రొమాంటిక్ మెలొడీ సాంగ్ వచ్చేసింది.. వినేయండి
ఈ పాటని సిద్ శ్రీరామ్, చిన్మయి పాటని పాడారు. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే..
సమంత - విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఖుషి’. ప్రేమకథలను తెరకెక్కించడంలో పట్టున్న శివ నిర్వాణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. ఖుషి నుంచి ఇప్పటికే వచ్చిన ‘నా రోజా నువ్వే’ సాంగ్ యూత్ ను బాగా ఆకట్టుకుంది. తాజాగా మరో పాటను కూడా చిత్రబృందం విడుదల చేసింది.
మణిరత్నం సినిమా టైటిల్స్ తో మొదటి పాటకి లిరిక్స్ రాసిన శివ నిర్వాణ.. ఆరాధ్య పాటకి కూడా సాహిత్యం అందించాడు. ఆరాధ్య.. నా ఆరాధ్య అంటూ సాగే పాటలో లిరిక్స్ కూడా బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాటని సిద్ శ్రీరామ్, చిన్మయి పాటని పాడారు. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా పాటలను విడుదల చేస్తున్నారు. రౌడీ ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూస్తున్న రొమాంటిక్ మెలొడీ సాంగ్ ఇది. ఈ పాటలో విజయ్ - సమంత ల మధ్య కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంటుంది. ఇద్దరి పెళ్లి, వ్యక్తిగత జీవితాలు, మళ్లీ ఇంటికొచ్చాక వారి మధ్య ఉండే ప్రేమను అక్కడక్కడా చూపించారు. ఇక సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తికావడంతో.. చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది. సెప్టెంబర్ 1న ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వరుస ఫ్లాప్ ల తర్వాత విజయ్ - సమంత లు ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇది మరో గీతగోవిందం - మజిలీ స్థాయి హిట్ అవ్వాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నాయి.
Next Story