Mon Dec 23 2024 05:46:32 GMT+0000 (Coordinated Universal Time)
వాల్తేరు వీరయ్య నుండి సెకండ్ సింగిల్.. చిరంజీవి గ్రేస్ మామూలుగా లేదుగా
తాజాగా వాల్తేరు వీరయ్య నుండి మరో సింగిల్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. అదే నువ్వు శ్రీదేవైతే..
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజా రవితేజ కాంబినేషన్ లో డైరెక్టర్ బాబీ పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించినన సినిమా వాల్తేరు వీరయ్య. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. 2023 సంక్రాంతి కి థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. చిరంజీవి సరసన శృతిహాసన్ నటించగా.. స్పెషల్ సాంగ్ లో ఊర్వశి రౌతేలా పెర్ఫార్మ్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుండి బాస్ పార్టీ సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. మొదట ఆ పాట పెద్దగా ఆకట్టుకోలేదు కానీ.. ఇప్పుడిప్పుడే జనాలు పాటను రీ ప్లే లో వింటున్నారు.
తాజాగా వాల్తేరు వీరయ్య నుండి మరో సింగిల్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. అదే నువ్వు శ్రీదేవైతే..నేను చిరంజీవి అవుతా పాట. "నువ్వు సీతవైతే నేను రాముడినంటా, నువ్వు రాధావైతే నేను కృషుడినంటా" అంటూ మొదలైన పాట.. మనం నిత్యం మాట్లాడే మాటలని పాటగా మారుస్తూ, 'నువ్వు శ్రీదేవి అయితే నేనే చిరంజీవి అంటా' అనే క్యాచీ లిరిక్స్ ముగించాడు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటని జస్ప్రీత్ జాస్జ్, సమీరా భరద్వాజ్ ఆలపించారు.
ఈ పాటను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా.. చిరంజీవి తన స్టెప్పులతో అదరగొట్టేశారు. శృతిహాసన్ పక్కన చాలా యంగ్ గా కనిపించారు. చిరంజీవి హిట్ సాంగ్స్ లో ఈ పాట కూడా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.
Next Story