Mon Dec 23 2024 11:25:36 GMT+0000 (Coordinated Universal Time)
సర్కారువారి పాట సెకండ్ సింగిల్ ప్రోమో.. తండ్రితో సితార స్టెప్పులు !
ఇటీవలే మరో సింగిల్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం.. అందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ఎవ్రీ పెన్నీ..
హైదరాబాద్ : మహేష్ బాబు- కీర్తి సురేష్ జంటగా.. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా సర్కారువారి పాట. ఈ సినిమా నుంచి ఇప్పటికే కళావతి పాట విడుదలవ్వగా.. మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇటీవలే మరో సింగిల్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం.. అందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ఎవ్రీ పెన్నీ అంటూ సాగే ఈ పాటలో మహేష్ తో పాటు.. ముద్దుల కూతురు సితార కూడా స్టెప్పులేసింది. తండ్రి కూతుళ్ల డ్యాన్స్ తో ప్రోమో అదిరిపోయింది.
సితార ఈ సినిమా ద్వారా తొలిసారిగా బిగ్ స్క్రీన్ పై కనిపించనుంది. ఈనెల 20న అంటే.. రేపు పూర్తి పాటను విడుదల చేయనుంది చిత్ర బృందం. అయితే ఈ పాట వెస్ట్రన్ స్టైల్ లో క్యాచీగా ఉంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం సర్కారువారి పాట షూటింగ్ దశలో ఉంది.
News Summary - Second Single Promo Out from Sarkaruvari Pata
Next Story