Sun Dec 22 2024 19:33:32 GMT+0000 (Coordinated Universal Time)
సీతారామం.. సక్సెస్ జర్నీ సాగుతోంది
దుల్కర్ సల్మాన్ హీరోగా, హను రాఘవపూడి కాంబినేషన్లో వచ్చిన సినిమా 'సీతారామం'.
దుల్కర్ సల్మాన్ హీరోగా, హను రాఘవపూడి కాంబినేషన్లో వచ్చిన సినిమా 'సీతారామం'. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించగా.. రష్మిక మందన, సుమంత్ కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతోంది. భారత్ లోనే కాకుండా అమెరికాలోనూ సినిమా కలెక్షన్లు భారీ స్థాయిలో ఉన్నాయి. 'సీతారామం' సినిమా యూఎస్‌లో 1 మిలియన్ డాలర్స్ కంటే ఎక్కువనే కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. సీతారామం సినిమా యూఎస్‌లో 1 మిలియన్ డాలర్స్‌కు పైగానే కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ ఈ సినిమా కలెక్షన్లు పెరుగుతున్నాయి.
విడుదలైన వారంలోపే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకొని లాభాల బాట పట్టింది ఈ సినిమా. ఈ సినిమా విజయంలో విజువల్స్, విశాల్ చంద్రశేఖర్ సంగీతం కీలకపాత్ర వహించింది. విశాల్ స్వర పరిచిన పాటలు విడుదలకు ముందు సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. సినిమాలో క్యూట్ లవ్ స్టోరీ ఉండడం.. ఎక్కడ కూడా బోర్ కొట్టకపోవడం.. సినిమా క్లాసిక్ అంటూ చూసిన వాళ్లు చెబుతూ ఉండడంతో సినిమాకు భారీగా కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు ఊహించని ఫాలోయింగ్ వచ్చింది.
Next Story