Mon Dec 23 2024 03:53:19 GMT+0000 (Coordinated Universal Time)
Allu Arjun : అల్లు అర్జున్కి కనీస గౌరవం ఇవ్వలేదంటూ సీనియర్ నటుడు అసహనం..
అల్లు అర్జున్కి కనీస గౌరవం ఇవ్వలేదంటూ సీనియర్ నటుడు మురళీమోహన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసారు.
Allu Arjun : 69 ఏళ్ళగా తెలుగు సినీ పరిశ్రమకు ఒక కలలా ఉన్న బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డుని.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాకు అందుకొని టాలీవుడ్ కి మొదటి అవార్డుని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. బన్నీ ఈ అవార్డు అందుకున్నందుకు ఇండస్ట్రీలోని ప్రతిఒక్కరు అభినందించారు. కానీ ఇవ్వాల్సిన కనీస గౌరవం ఇవ్వలేదంటూ సీనియర్ నటుడు మురళీమోహన్ అసహనం వ్యక్తం చేసారు.
తెలుగు చలన చిత్రసీమ ఎన్నో ఏళ్ళ కలని అల్లు అర్జున్ నిజం చేస్తూ 'ఉత్తమ జాతీయ నటుడు' అవార్డుని తీసుకు వస్తే.. టాలీవుడ్ ఇండస్ట్రీ సన్మానించి కనీస గౌరవం ఇవ్వలేదని మురళీ మోహన్ అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఎందుకు చేయలేదు అని కూడా సినీ పెద్దలను ప్రశ్నించారు. ఒకప్పుడు సినీ పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పుడు ఇలా ఉండేది కాదని తెలియజేస్తూ.. ఇప్పటి ఇండస్ట్రీ ప్రముఖుల తీరుని ఎండగట్టారు.
నిన్న మార్చి 22న జరిగిన సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ లో మురళీ మోహన్ ఈ కామెంట్స్ చేశారు. ఈ ఈవెంట్ లో చిరంజీవికి పద్మవిభూషణ్ అందుకున్నందుకు.. ఇండస్ట్రీలోని పలువురు ప్రముకు సత్కరించారు. అల్లు అర్జున్ విషయంలో చేసిన తప్పుని చిరంజీవి విషయంలో చేయలేదు.. అందుకు సంతోషం అంటూ మురళీ మోహన్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ అయితే హాట్ టాపిక్ గా మారాయి.
Next Story