Mon Dec 23 2024 10:26:37 GMT+0000 (Coordinated Universal Time)
సాయి ధరమ్ తేజ్ మూవీకి హీరో నరేష్ కొడుకు డైరెక్టర్ అని మీకు తెలుసా..?
సాయి ధరమ్ తేజ్ నటించిన కొంత మూవీకి సీనియర్ హీరో నరేష్ కొడుకు డైరెక్టర్ అనే విషయం మీకు తెలుసా..?
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఈ ఏడాది విరూపాక్ష (Virupaksha), బ్రో (Bro) చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఒక చిన్న షార్ట్ ఫీచర్ ఫిలింతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. దేశభక్తి, సైనికులు నేపథ్యంలో ‘సత్య’ (Satya) అనే టైటిల్ తో రాబోతున్న ఈ మూవీలో తేజ్ దేశ సైనికుడిగా కనిపించబోతున్నాడు. ఇక అతని భార్యగా 'కలర్ స్వాతి' నటిస్తుంది.
అసలు ఇంతకీ ఈ మూవీ డైరెక్టర్ ఎవరో తెలుసా..? సీనియర్ హీరో నరేష్ (Naresh) కొడుకు నవీన్ విజయ కృష్ణ (Naveen Vijaya Krishna) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. నవీన్ ఎడిటర్ గా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు. కృష్ణవంశీ 'డేంజర్' సినిమాకు నవీన్ ఎడిటర్ గా పని చేశాడు. ఆ తరువాత నాయనమ్మ విజయ్ నిర్మల (Vijaya Nirmala) కోరిక మేరకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
మహానటి 'కీర్తి సురేష్' హీరోయిన్ గా నవీన్ హీరోగా ‘ఐనా ఇష్టం నువ్వు’ అనే టైటిల్‌తో తెరకెక్కిన సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత కూడా హీరోగా మరో సినిమాలో నటించిన పెద్దగా అదృష్టం కలిసి రాలేదు. అప్పటి నుంచి యాక్టింగ్ కి కూడా కొంచెం దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే నవీన్ కి మొదటి నుంచి డైరెక్షన్ మీద ఆశ ఉండేది. కానీ విజయ నిర్మల కోరిక వలన నటన వైపు వెళ్లాల్సి వచ్చింది.
ఇక ఇప్పుడు తనకిష్టమైన దారిలో ప్రయాణం మొదలుపెట్టి 'సత్య' అనే ఫీచర్ మూవీని డైరెక్ట్ చేశాడు. తేజ్ అండ్ నవీన్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వడంతో ఈ మూవీలో నటిస్తాను అని తేజే అడిగాడట. సినిమా కథ ఏంటంటే.. 'దేశం కోసం ప్రాణాలు ఇచ్చి సైనికులు ఎంతటి త్యాగానికి పూనుకుంటున్నారో, తమ భర్తలను దేశం కోసం పంపించి వారి భార్యలు కూడా అలాంటి త్యాగానికే పూనుకుంటున్నారు' అని చెప్పుకొస్తున్నారు. 23 నిముషాలు ఉండే ఫిలింలో 6 నిముషాలు పాట ఉంటుంది. ఇటీవల ఆ సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు.
Next Story