Mon Dec 23 2024 02:54:32 GMT+0000 (Coordinated Universal Time)
జయప్రద ఇంట తీవ్ర విషాదం
తన అందం, అభినయంతో ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జయప్రద..
ప్రముఖ సీనియర్ నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జయప్రదకు మాతృవియోగం కలిగింది. ఆమె తల్లి నీలవేణి తీవ్ర అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో కన్నుమూశారు. తల్లి మరణవార్తతో.. ఢిల్లీలో ఉన్న జయప్రద హుటాహుటిన బయల్దేరి హైదరాబాద్ కు చేరుకున్నారు. తల్లి నీలవేణి మరణంతో జయప్రద తీవ్ర విషాదంలో ఉన్నారు. తల్లి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
జయప్రద తల్లి నీలవేణి మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులు.. సంతాపం తెలుపుతున్నారు. కాగా.. తన అందం, అభినయంతో ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జయప్రద.. భూమికోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలి, మరాఠి భాషల్లో మొత్తం 300లకు పైగా చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె.. అక్కడ కూడా తన సత్తా చాటారు. ప్రస్తుతం ఆమె బీజేపీ లో సభ్యురాలిగా ఉన్నారు.
Next Story