Mon Dec 23 2024 04:06:09 GMT+0000 (Coordinated Universal Time)
సీనియర్ హీరోయిన్ కు ఒమిక్రాన్ పాజిటివ్ !
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇలా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా
దేశంలో కరోనాతో పాటు ఒమిక్రాన్ కూడా విజృంభిస్తోంది. థర్డ్ వేవ్ ఎఫెక్ట్ చాలా ఉంటుందని ఓ పక్క వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా.. ప్రజలు మాత్రం ఏమవుతుందిలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో కొన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. సాధారణ ప్రజలతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు సైతం కోవిడ్, ఒమిక్రాన్ ల బారిన పడుతున్నారు.
Also Read : తెలంగాణకు భారీ వర్షసూచన..
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇలా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్ శోభన చంద్రకుమార్ కు ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
Also Read : మాస్క్ లేకుండా బస్సెక్కారో.. భారీ ఫైనే
"ప్రపంచమంతా అద్భుతంగా నిద్రపోతున్న వేళ.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి నేను ఒమిక్రాన్ బారిన పడ్డాను. కీళ్లనొప్పులు, చలి, గొంతు నొప్పి వంటి లక్షణాలతో ఇబ్బంది పడ్డాను. ఇప్పటికే రెండు టీకాలు తీసుకున్నాను. దీని వల్ల ఒమిక్రాన్ ముప్పు నుంచి 85శాతం కోలుకుంటామని నమ్ముతున్నాను. అందరూ వ్యాక్సిన్లు వేయించుకోవాలని కోరుకుంటున్నాను" అని శోభన ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.
Next Story