Mon Dec 23 2024 16:32:52 GMT+0000 (Coordinated Universal Time)
వెబ్ సిరీస్ తో త్రిష రీ ఎంట్రీ
20 ఏళ్లుగా వెండితెరపై కనిపిస్తోన్న త్రిష.. ప్రస్తుతం తమిళ సినిమాలు మాత్రమే చేస్తోంది. తెలుగులో నటించి చాలాకాలం అయింది.
ప్రముఖ సీనియర్ హీరోయిన్ త్రిష.. వర్షం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది. అప్పట్నుంచి తెలుగులో ఆమెకున్న ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. 20 ఏళ్లుగా వెండితెరపై కనిపిస్తోన్న త్రిష.. ప్రస్తుతం తమిళ సినిమాలు మాత్రమే చేస్తోంది. తెలుగులో నటించి చాలాకాలం అయింది. 2016 నాయకి సినిమాలో కనిపించిన ఈ సీనియర్ హీరోయిన్.. ఆ తర్వాత ఒక్క తెలుగు సినిమాలోనూ కనిపించలేదు. చాలా గ్యాప్ తర్వాత ఓ వెబ్ సిరీస్ తో తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.
Also Read : మహారాష్ట్ర లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
బృందా అనే వెబ్ సిరీస్ లో త్రిష ఓ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించనుంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్ స్టా ద్వారా నెటిజన్లతో పంచుకున్నారు. సోనీలివ్ లో ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది. త్రిష చేస్తున్న తొలి వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం. బృందా లో త్రిష మెయిన్ లీడ్.. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. ఆ షూటింగ్ లోని ఓ ఫొటోను త్రిష షేర్ చేసింది.
News Summary - Senior Heroine Trisha Re Entry in Telugu with Brinda Web Series
Next Story