Sun Dec 29 2024 03:00:11 GMT+0000 (Coordinated Universal Time)
Actress Hema: మరోసారి చిక్కుల్లో నటి హేమ.. మా మళ్లీ యాక్షన్ తీసుకోబోతోందా?
బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు
బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. మొత్తం 88 మందిని నిందితులుగా చేర్చారు. తాను డ్రగ్స్ తీసుకోలేదంటూ మీడియా ముందుకు వచ్చిన తెలుగు సీనియర్ నటి హేమ పేరును ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. హేమ డ్రగ్స్ సేవించిందని పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 1086 పేజీలతో పోలీసులు ఛార్జ్‌షీట్ ను సిద్ధం చేశారు. NDPS సెక్షన్- 27 కింద ఛార్జ్‌షీట్‌లో హేమను నిందితురాలిగా చేర్చారు పోలీసులు.
బెంగళూరులో కొన్ని నెలల కిందట రేప్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీపై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ( సీసీబీ ) అధికారులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. వాసు అనే వ్యక్తి బర్త్ డేతో పాటు తన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ పార్టీ ఏర్పాటు చేయగా పలువురు ప్రముఖులు ఈ పార్టీలో పాల్గొన్నారు. నటి హేమ కూడా ఈ పార్టీకే హాజరయ్యారు. మొదట తాను బెంగళూరులో లేనని, హైదరాబాద్ లో ఉన్నానని చెప్పారు. కానీ ఆ వీడియోనే పోలీసులకు ఓ సాక్ష్యంగా మారిందంటూ కథనాలు కూడా వచ్చాయి. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ ఆమె చెబుతూ వచ్చారు. అనవసరంగా తనపై ఆరోపణలు మోపారని, తాను డ్రగ్స్ తీసుకోలేదంటూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తనపై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తేయాలని ఆమె డిమాండ్ చేశారు. మా ఆమెపై సస్పెన్షన్ ను ఎత్తివేసింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించారు. అందులో నటి హేమ ఎండీఎంఏ సేవించిందని అన్నారు. అందుకు సంబంధించి ఆమె వైద్య పరీక్ష ఫలితాలను జతపరిచారు. పార్టీకి హాజరైన మరో నటికి టెస్టులు చేయగా డ్రగ్స్ నెగెటివ్ రావడంతో ఆమెను సాక్షుల్లో ఒకరిగా పరిగణిస్తున్నట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు.
Next Story