Sat Nov 23 2024 01:20:23 GMT+0000 (Coordinated Universal Time)
ఘనంగా బ్రహ్మానందం కుమారుడి వివాహం
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ వివాహ రిసెప్షన్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ వివాహ రిసెప్షన్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. నగరానికి చెందిన డా. పద్మజ వినయ్‌ల కుమార్తె ఐశ్వర్య ను సిద్ధార్థ పెళ్లి చేసుకున్నారు. అన్వయ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, సినీ నటులు నందమూరి బాలకృష్ణ, రామ్ చరణ్, మోహన్ బాబు తదితరులు కొత్త దంపతులను ఆశీర్వదించారు.
సిద్ధార్థ వివాహ రిసెప్షన్‌కి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. నూతన వధూ వరులను ఆశీర్వదించారు. సీఎం కెసిఆర్‌తోపాటు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సినీ నటులు శ్రీకాంత్, శ్రీనివాస్ రెడ్డి, గరికపాటి నర్సింహరావు, చిరంజీవి సతీమణి సురేఖ, పెద్దమ్మాయి సుష్మిత, శ్రీకాంత్ ఫ్యామిలీ, సాయి కుమార్ ఫ్యామిలీ, మంచు విష్ణు దంపతులు, మంచు మనోజ్ దంపతులు, దర్శకులు కోదండరామిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, శేఖర్ కమ్ముల, నటులు రావు రమేష్, తదితరులు సందడి చేశారు. టాలీవుడ్ లెజెండరీ కమెడియన్ కుమారుడిని ఆశీర్వదించడానికి పలు రంగాల ప్రముఖులు వచ్చారు. సిద్ధార్థ, ఐశ్వర్యల వివాహం శుక్రవారం (ఆగస్టు 18) రాత్రి 10.45 గంటలకు హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న అన్వయ కన్వెన్షన్స్ లో జరిగింది.
Next Story