Thu Dec 26 2024 20:31:45 GMT+0000 (Coordinated Universal Time)
శాకుంతలం రిలీజ్ డేట్ ఫిక్స్
ఈ గ్లింప్స్ వీడియోలో సమంత, దేవ్ మోహన్ లు శకుంతల, దుశ్యంతలుగా ఫోజ్ ఇస్తూ కనిపించారు. ఈ ఫోజ్ లో సమంత..
టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో.. సమంత లీడ్ గా ఎపిక్ లవ్ స్టోరీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా "శాకుంతలం". మైథలాజికల్ డ్రామాగా పాన్ ఇండియా లో ఈ సినిమా విడుదల చేస్తామని చిత్రబృందం ఎప్పట్నుంచో చెప్తూ వస్తోంది. సినిమా విడుదల తేదీ ఎప్పుడు ప్రకటిస్తారా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు నేడు తెరపడింది. చిత్రబృందం శాకుంతలం విడుదల తేదీని ప్రకటించింది. నవంబర్ 4వ తేదీన "శాకుంతలం" సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ.. ఓ చిన్న వీడియో గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేసింది.
ఈ గ్లింప్స్ వీడియోలో సమంత, దేవ్ మోహన్ లు శకుంతల, దుశ్యంతలుగా ఫోజ్ ఇస్తూ కనిపించారు. ఈ ఫోజ్ లో సమంత ఎంతో అందంగా ఉందని అభిమానులు ప్రశంసిస్తున్నారు. దర్శకుడు గుణశేఖర్ తన హోం బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పై శాకుంతలం సినిమాను నిర్మించారు. చాలాకాలం తర్వాత ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్, గౌతమి తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Next Story