Mon Dec 23 2024 04:31:43 GMT+0000 (Coordinated Universal Time)
Rajinikanth : రజిని, లోకేశ్ కనగరాజ్ సినిమాలో షారుఖ్.. నిజమేనా..?
తలైవా 171 సినిమాలో షారుఖ్ ఖాన్ ఒక ముఖ్య చేయబోతున్నారట. లోకేష్, షారుఖ్ ని సంప్రదించి చర్చలు కూడా జరిపారట. ఇంతకీ ఏమైంది..?
Rajinikanth : ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా ఫేమ్ ని సంపాదించుకున్న లోకేష్ కానగరాజ్.. తన తదుపరి ప్రాజెక్ట్ ని సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ‘తలైవా 171’గా రూపొందుబోతున్న ఈ మూవీ వచ్చే ఏడాది షూటింగ్ మొదలు పెట్టుకోనుంది. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ గురించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ ఒక ముఖ్య చేయబోతున్నారట. లోకేష్, షారుఖ్ ని సంప్రదించి చర్చలు కూడా జరిపారట. ఇంతకీ ఏమైంది..?
‘తలైవా 171’లో ఒక ముఖ్య పాత్రని బాలీవుడ్ స్టార్ తో చేయించాలని భావించిన లోకేష్ కానగరాజ్.. షారుఖ్ ని సంప్రదించారట. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారట. ఇటీవల అతిథి పాత్రల్లో తాను ఎక్కువ కనబడుతున్నట్లు, అవి తగ్గించి పూర్తిగా తన సినిమాల పైనే కంప్లీట్ ఫోకస్ పెట్టాలని షారుఖ్ నిర్ణయించారట. ఈ విషయానే లోకేష్ కి తెలియజేశారట. ఇక షారుఖ్ నో చెప్పడంతో లోకేష్ కానగరాజ్.. మరో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ని సంప్రదించారట.
ఆయన ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కథ వినడానికి లోకేష్ సమయం కూడా కేటాయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే, లోకేష్ కానగరాజు సోషల్ మీడియాకి బ్రేక్ ప్రకటిస్తూ ఒక నోట్ రిలీజ్ చేశారు. రీసెంట్ గా లోకేష్ ‘జీస్క్వాడ్’ అనే ప్రొడక్షన్ బ్యానర్ స్థాపించి ‘ఫైట్క్లబ్’ అనే చిత్రాన్ని నిర్మించారు.
ఇక ఈ సినిమాని ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేసిన లోకేష్ కానగరాజ్.. కొంతకాలం సోషల్మీడియా ప్లాట్ఫామ్స్, సెల్ఫోన్ కి బ్రేక్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ (తలైవా 171) పై దృష్టి పెట్టేందుకే ఈ బ్రేక్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే మళ్ళీ తిరిగి వస్తానని చెప్పుకొచ్చారు.
Next Story