Mon Dec 23 2024 04:56:43 GMT+0000 (Coordinated Universal Time)
Allu Arjun : అల్లు వారసుడి నోట.. షారుఖ్ పాట.. వీడియో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్.. షారుఖ్ ఖాన్ పాటని పాడి అదుర్స్ అనిపిస్తున్నాడు.
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్.. ప్రెజెంట్ సోషల్ మీడియా మోడల్ అయ్యిపోయాడు. ఈమధ్య కాలంలో అయాన్ చేసే అల్లరి పనులు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయాన్ చేసే చిలిపి పనులకు అల్లు అభిమానులు, నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఆ అల్లరికి అభిమానులు అయ్యిపోయి.. అయాన్ని ‘మోడల్’ అంటూ పిలుచుకుంటున్నారు.
ఇటీవల అల్లు అర్జున్ కూడా తన ఫ్యాన్స్ లాగానే.. అయాన్ ని మోడల్ అంటూ పిలిచిన వీడియో నెట్టింట బాగా వైరల్ అయ్యింది. ఇక తాజాగా అయాన్ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో అయాన్ షారుఖ్ ఖాన్ మూవీలోని పాటని పాడుతున్నాడు. ఇటీవల షారుఖ్ నుంచి ఆడియన్స్ ముందుకు వచ్చిన ఎమోషనల్ డ్రామా మూవీ ‘డంకీ’. ఆ సినిమాలో ‘లుటు పుటు గయా’ అనే సాంగ్ ఉంటుంది.
ఆ పాటనే అయాన్ తన అల్లరిలో భాగంగా పాడి వినిపించాడు. అల్లరిలో భాగంగానే పాడిన.. పాటని మాత్రం అయాన్ బాగానే పాడాడు. ఇక అయాన్ లో ఈ యాంగిల్ కూడా చూసిన నెటిజెన్స్, అభిమానులు.. 'మోడల్ అయాన్ బొల్తే' అంటూ కామెంట్స్ చేస్తూ ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు. కాగా కొంతమంది ఆడియన్స్.. ఆ వీడియోని షారుఖ్ తో ట్యాగ్ చేసి షేర్ చేస్తున్నారు. మరి ఈ వీడియో షారుఖ్ వరుకు వెళ్లి ఆయన రియాక్ట్ అవుతాడేమో చూడాలి.
Next Story