Mon Dec 23 2024 06:49:05 GMT+0000 (Coordinated Universal Time)
Dunki : షారుఖ్ 'డంకీ' ఆ సినిమాకి రీమేక్నా..?
షారుఖ్ 'డంకీ' ఆ సౌత్ సినిమాకి ఫ్రీమేక్ గానే వస్తుందని టీజర్ తో అర్ధమవుతుంది.
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్.. ఈ ఏడాది ఇప్పటికే జవాన్, పఠాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టి.. రెండు సినిమాలతో ఆ అమ్ర్క్ అందుకున్న మొదటి హీరోగా రికార్డు సృష్టించాడు. ఇక ఇప్పుడు మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చూపడానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రిస్ట్మస్ కానుకగా 'డంకీ' అనే సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నాడు. బాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
మున్నా భాయ్ ఎంబిబిఎస్, 3 ఇడియట్స్, పీకే వంటి బ్లాక్ బస్టర్స్ తెరకెక్కించిన హిరానీ.. పఠాన్, జవాన్ తో సూపర్ ఫార్మ్ లో ఉన్న షారుఖ్ తో కలిసి వస్తున్నాడంటే ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీ టీజర్ చూశాక.. ఆ అంచనాలు తారుమారు అయ్యినట్లు అయ్యింది. ఈ సినిమా మలయాళ హిట్ మూవీకి ఫ్రీమేక్ గా వస్తుందంటూ కొన్నిరోజులు నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు టీజర్ తో ఆ నిజమని అర్ధమవుతుంది.
2017లో దుల్కర్ సల్మాన్ హీరోగా మలయాళంలో తెరకెక్కిన సినిమా 'కామ్రేడ్ ఇన్ అమెరికా'. ఈ సినిమాలో దుల్కర్ తను ప్రేమించిన అమ్మాయి కోసం.. వీసా, పాస్పోర్ట్ లేకుండా అక్రంగా అమెరికా బయలుదేరుతాడు. ఈ ప్రయాణంలో అతడు ఎదుర్కొన్న సంఘటనలే సినిమా కథ. ఎమోషనల్ గా సాగే సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ కథలో కొన్ని మార్పులు చేసి హిరానీ, షారుఖ్ 'డంకీ' తెరకెక్కించినట్లు తెలుస్తుంది.
పఠాన్, జవాన్ సినిమాలు మాదిరి.. ఈ మూవీలో యాక్షన్ పార్ట్ కూడా పెద్దగా కనిపించదు. దీంతో మూవీ మీద ఉన్న హైప్ తగ్గినట్లు అయ్యింది. హిరానీ తన కెరీర్ లో ఇప్పటి వరకు ప్లాప్ అనేది అందుకోలేదు. ప్రతి మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. మరి ఇప్పుడు డంకీతో ఎలాంటి రిజల్ట్ ని ఎదుర్కొంటాడో చూడాలి. డిసెంబర్ 21న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
Next Story