Fri Jan 10 2025 17:51:06 GMT+0000 (Coordinated Universal Time)
Ram Charan : షారుక్ అవమానించలేదు.. రజినీతో చరణ్‌ని పోల్చాడు..
అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో రామ్‌చరణ్ ని షారుఖ్ అవమానించలేదు.. తన డైలాగ్‌తో రజినీతో చరణ్‌ని పోల్చాడు.
Ram Charan : ఇటీవల అంబానీ ఇంట జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి బాలీవుడ్ స్టార్స్ తో పాటు సౌత్ స్టార్స్ కూడా అటెండ్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఆ సెలబ్రేషన్స్ కి టాలీవుడ్ నుంచి మెగా కపుల్ రామ్ చరణ్ ఉపాసన హాజరయ్యారు. ఇక ఆ ఈవెంట్ లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్‌తో కలిసి రామ్ చరణ్ నాటు నాటు స్టెప్ వేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్న విషయం కూడా తెలిసిందే.
అయితే ఈ వీడియోతోనే షారుక్, చరణ్ మధ్య కాంట్రవర్సీకి తెరలేపుతున్నారు కొంతమంది. ఆ వీడియోలో రామ్ చరణ్ ని పిలిచేటప్పుడు షారుఖ్.. ఇడ్లీ వడ అని సంబోధించడం అవమానకరమని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ కాంట్రవర్సిని కొన్ని వెస్ సైట్స్ రాసుకొస్తూ.. సౌత్ స్టార్స్ ని ఇడ్లీ వడ అన్నట్లు, నార్త్ స్టార్స్ ని భేల్ పూరీ, వడా పావ్ అని సంబోధిస్తే ఊరుకుంటారా అని ఆర్టికల్స్ వేస్తున్నారు.
కానీ అక్కడ జరిగిన అసలు విషయం ఏంటంటే, షారుఖ్ తన మూవీలోని డైలాగ్ చెబుతూ.. రామ్ చరణ్‌ని రజినీకాంత్ తో పోల్చాడు. షారుఖ్ నటించిన ‘వన్ 2 కా 4’ సినిమాలో సౌత్ లోని ఫేమస్ విషయాలను గురించి షారుక్ మాట్లాడుతూ.. ఇడ్లీ, వడ, రజినీకాంత్ అంటూ డైలాగ్ చెబుతారు. ఆ డైలాగ్ లో రజిని పేరు తీసేసి రామ్ చరణ్ పేరు పెట్టి షారుక్ ఆ ఈవెంట్ లో సంబోధించారు.
ఈ విషయం తెలియని టాలీవుడ్ ప్రేక్షకులు.. షారుఖ్ అండ్ చరణ్ మధ్య కాంట్రవర్సి క్రియేట్ చేస్తున్నారు. అయితే షారుఖ్ అభిమానులు అసలు విషయం ఏంటో తెలియజేస్తూ.. ఆ డైలాగ్ కి సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేస్తున్నారు. ఆ వీడియోతో అసలు నిజమేంటో తెలిసి ఓ క్లారిటీ వచ్చేసింది. మరి ఆ వీడియోని మీరు కూడా చూసేయండి.
Next Story