Mon Dec 23 2024 08:08:44 GMT+0000 (Coordinated Universal Time)
కేజీఎఫ్ 2 రికార్డ్ బ్రేక్ చేసిన పఠాన్.. తొలిరోజే రూ.100 కోట్లకు పైగా..
ప్రపంచ వ్యాప్తంగా బుధవారం ఈ సినిమా పలు భాషల్లో విడుదలైంది. చాలాకాలం తర్వాత బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్ ను..
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. చాలా గ్యాప్ తర్వాత వెండితెరపై కనిపించిన సినిమా "పఠాన్". సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ సినిమాలో షారుక్ సరసన దీపికా పదుకొణే హీరోయిన్ గా నటించింది. ప్రపంచవ్యాప్తంగా బుధవారం ఈ సినిమా పలు భాషల్లో విడుదలైంది. చాలాకాలం తర్వాత బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్ ను తట్టుకుని నిలబడింది ఈ సినిమా. తొలిరోజే పఠాన్ ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టింది.
తొలిరోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా పఠాన్ రికార్డు సృష్టించింది. భారత్ లోనే రూ.67 కోట్ల గ్రాస్ రాబట్టగా.. విదేశాల్లో రూ.35 కోట్ల వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా తొలిరోజే "పఠాన్" రూ.102 కోట్లు వసూలు చేసి కేజీఎఫ్ 2 రికార్డును బ్రేక్ చేసింది. యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ -2 తొలి రోజు 53. 9 కోట్లు వసూలు చేసింది.
Next Story