Mon Dec 23 2024 04:43:08 GMT+0000 (Coordinated Universal Time)
నయనతార, విజయ్ సేతుపతిల గురించి షారుఖ్ ఖాన్ ఏమన్నారంటే..?
షారుఖ్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జవాన్ రూపొందుతోంది.
2023లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ భారీ సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఆయన వరుసగా చేస్తున్న సినిమాల్లో 'జవాన్' కూడా ఒకటి.. శరవేగంగా సినిమా షూటింగ్ను పూర్తీ చేస్తున్నారు. దక్షిణాదిలో స్టార్ యాక్టర్స్ గా పేరు తెచ్చుకున్న నయనతార, విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటిస్తూ ఉన్నారు. షారుఖ్ ఖాన్ తాజాగా జవాన్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను ట్విట్టర్ లో పంచుకున్నాడు. రజనీకాంత్ కూడా తమ సినిమా సెట్స్ లోకి వచ్చారని షారుఖ్ ఖాన్ అన్నారు. సినిమా నిర్మాణ సమయంలో నయనతార, విజయ్ సేతుపతి వంటి అద్భుతమైన నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్నానని షారుఖ్ ట్వీట్ చేశారు.
'Wot a 30 days blast RCE team! Thalaivar blessed our setssaw movie with Nayanthara partied with @anirudhofficial deep discussions with @VijaySethuOffl & Thalapathy @actorvijay fed me delicious food. Thx @Atlee_dir & Priya for your hospitality now need to learn Chicken 65 recipe (sic)!' అంటూ షారుఖ్ పోస్టు పెట్టారు. దళపతి విజయ్ తనకు అద్భుతమైన భోజనాన్ని పెట్టారని చెప్పుకొచ్చారు షారుఖ్.
షారుఖ్, నయనతార, విజయ్ సేతుపతితో పాటు, జవాన్ సినిమాలో ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగి బాబు కూడా నటించారు. బిగిల్ ఫేమ్ అట్లీ ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. షారుఖ్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జవాన్ రూపొందుతోంది.
Next Story