Mon Dec 23 2024 04:59:09 GMT+0000 (Coordinated Universal Time)
Guntur Kaaram : 'గుంటూరు కారం'పై షారుఖ్ ట్వీట్.. ఏమన్నాడంటే..
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 'గుంటూరు కారం' మూవీ గురించి ట్వీట్ చేశారు. ఆయన ఏమ్మన్నారంటే..
Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'గుంటూరు కారం' ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండడంతో.. ఈ చిత్రం పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే థియేటర్స్ వద్ద ఈ చిత్రం.. ఆ అంచనాలను అందుకోవడంలో కాస్త తడపడింది. అయితే కలెక్షన్స్ విషయంలో మాత్రం ఫుల్ జోరు చూపిస్తుంది.
ఇది ఇలా ఉంటే, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 'గుంటూరు కారం' మూవీ గురించి ట్వీట్ వేయడం.. ఇప్పుడు వైరల్ గా మారింది. షారుఖ్ తన ట్విట్టర్ లో గుంటూరు కారం ట్రైలర్ ని షేర్ చేస్తూ.. "నా ఫ్రెండ్ మహేష్ బాబు గుంటూరు కారం చూడడానికి నేను ఎదురు చూస్తున్నాను. సినిమాలో యాక్షన్, ఎమోషన్, అలాగే ఘాటెక్కించే మాస్ ఉంటాయని అనుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశారు. ఇక ట్వీట్ కి మహేష్ బదులిస్తూ.. "మీ సపోర్ట్ కి థాంక్యూ షారుఖ్. మీ అందరికి నా ప్రేమని తెలియజేస్తున్నాను" అంటూ ట్వీట్ వేశారు.
ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ చూసిన తరువాత షారుఖ్ నుంచి మరో ట్వీట్ కూడా రావడం ఖాయం. దీంతో మహేష్ అభిమానులు షారుఖ్ రివ్యూ కోసం ఎదురు చూస్తున్నారు. కాగా గతంలో షారుఖ్ 'జవాన్' సినిమా రిలీజైతే మహేష్ బాబు కూడా ఇలానే ట్వీట్ చేశారు. ఇప్పుడు షారుఖ్ తిరిగి ట్వీట్ చేయడం మహేష్ అభిమానులను ఖుషి చేస్తుంది. కాగా ఈ మూవీ మొదటి రోజు రికార్డు కలెక్షన్స్ నమోదు చేసింది. తెలుగు లాంగ్వేజ్ లోనే భారీ స్థాయిలో రిలీజైన ఈ చిత్రం.. 94 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడం సంచలనంగా మారింది. ఒక్క లాంగ్వేజ్ తోనే ఈ రేంజ్ కలెక్షన్స్ నమోదు చేయడం రికార్డు అనే చెప్పాలి.
Next Story