Sun Dec 22 2024 23:57:27 GMT+0000 (Coordinated Universal Time)
మహేష్ బాబుతో కలిసి 'జవాన్' చూస్తా అంటున్న షారుఖ్..
మహేష్ బాబుతో కలిసి 'జవాన్' మూవీ చూస్తాను అంటున్న షారుఖ్ ఖాన్ చేసిన ట్వీట్..
బాలీవుడ్ హీరో షారుఖ్ (Shah Rukh Khan) డ్యూయల్ రోల్ లో నటిస్తూ చేసిన సినిమా 'జవాన్' (Jawan). తమిళ్ డైరెక్టర్ అట్లీ ఈ మూవీని తెరకెక్కించగా.. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రేపు (సెప్టెంబర్ 7) గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా విడుదలను విష్ చేస్తూ పలువురు సెలబ్రిటీస్ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ హీరో మహేష్ బాబు (Mahesh Babu) కూడా సినిమా హిట్ అవ్వాలంటూ ట్వీట్ చేశాడు.
అలాగే మూవీని ఫ్యామిలీతో కలిసి చూడడానికి ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ కి షారుఖ్ ఖాన్ థాంక్యూ చెబుతూ బదులిచ్చాడు. అలాగే మహేష్ ఈ సినిమాని ఎక్కడ చూస్తాడో చెబితే.. తాను కూడా అక్కడికి వచ్చి మహేష్ తో కలిసి సినిమా చూస్తాను అంటూ షారుఖ్ పేర్కొన్నాడు. ఇక ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి సోషల్ మీడియాలో ఇలా ట్వీట్స్ చేసుకోవడంతో నెట్టింట ఈ పోస్టులు వైరల్ అవుతున్నాయి.
ఇక జవాన్ విషయానికి వస్తే.. పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న మూవీ కావడంతో భారీ హైప్ నెలకుంది. అట్లీ దర్శకుడు కావడంతో సౌత్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో తమిళ్ అండ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి బుకింగ్స్ జరుగుతున్నాయి. పఠాన్ 1000 కోట్ల కలెక్షన్స్ అందుకొని ఆ క్లబ్ లో అడుగుపెట్టిన ఫస్ట్ బాలీవుడ్ మూవీగా నిలిచింది. ఇక ఇప్పుడు జవాన్ కూడా ఆ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు.
ఒకవేళ ఇదే జరిగితే.. 1000 కోట్ల క్లబ్ లో రెండు చిత్రాలు ఉన్న ఏకైక హీరోగా షారుఖ్ నిలుస్తాడు. మరి జవాన్ షారుఖ్ కి ఈ రేర్ రికార్డుని సొంతం చేసి పెడుతుందా..? లేదా..? అనేది చూడాలి. కాగా ఈ చిత్రాన్ని షారుఖ్ ఖాన్ తన ఓన్ ప్రొడక్షన్ హౌస్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించాడు. నయనతార, విజయ్ సేతుపతి, ప్రధాన పాత్రలు పోషిస్తుంటే దీపికా పదుకొనే గెస్ట్ రోల్ లో కనిపించబోతుంది. అనిరుద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు.
Next Story