Sun Dec 22 2024 23:44:33 GMT+0000 (Coordinated Universal Time)
షారుఖ్ ఖాన్ 'జవాన్' పబ్లిక్ రివ్యూ వచ్చేసింది..
షారుఖ్ ఖాన్ యాక్షన్ ఎంటర్టైనర్ 'జవాన్' మూవీ రిలీజ్ అయ్యిపోయింది. మరి థియేటర్ లో ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ని అందుకుంది.
షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా విజయ్ సేతుపతి (Vijay Sethupathi) విలన్ గా, నయనతార (Nayanathara) హీరోయిన్ గా నటించిన ‘జవాన్’ (Jawan) సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. తమిళ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో షారుఖ్ తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్ లో నటించాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్ మూవీ పై భారీ హైప్నే క్రియేట్ చేశాయి.
అలాగే పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న మూవీ కావడంతో అంచనాలు మరింత ఎక్కువే ఉన్నాయి. దర్శకుడు అట్లీతో పాటు సినిమాలో చాలామంది సౌత్ యాక్టర్స్ ఉండడంతో తెలుగు, తమిళ భాషల్లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. మరి నేడు థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలాంటి రివ్యూస్ అందుకుంటుంది. పఠాన్ సక్సెస్ ని జవాన్ కంటిన్యూ చేసిందా..? మూవీ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో తమ రివ్యూలను ఇచ్చేస్తున్నారు. అవి చూసి సినిమా రిజల్ట్ ఏంటో మీరే తెలిసేసుకోండి.
Next Story