Sun Dec 22 2024 23:28:41 GMT+0000 (Coordinated Universal Time)
జవాన్ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ లో కనిపించిన స్టార్ ఎవరంటే?
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో థియేటర్లలో రిలీజ్ అయింది. మార్నింగ్ షో నుంచి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది జవాన్. జవాన్ చిత్రంల్లో అతిథి పాత్రల్లో కనిపిస్తారని కొంతకాలంగా కొందరు స్టార్ హీరోల పేర్లు వినిపించాయి. తమిళ హీరో దళపతి విజయ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్యామియో చేశారని చాలా కాలం పుకార్లు చక్కర్లు కొట్టాయి. జవాన్ సినిమా రిలీజ్ కావటంతో ఆ సస్పెన్స్ వీడింది.
జవాన్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ క్యామియో రోల్ చేశారు. అతిథి పాత్రలో జవాన్ చిత్రంలో కనిపించారు సంజయ్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ చిత్రంలో మోహన్‌లాల్, శివరాజ్ కుమార్ క్యామియో రోల్స్ సూపర్ పాపులర్ అవ్వడంతో. జవాన్ సినిమాలోనూ క్యామియోలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ట్రైలర్ లో కొన్ని షాట్స్ లో విజయ్ లాగా షారుఖ్ ఖాన్ ఉండడం చూసి ఫోటోలు షేర్ చేశారు. అయితే, సంజయ్ దత్ ఒక్కరే క్యామియో రోల్లో కనిపించారు. ఇక సినిమాలో షారుఖ్ ఖాన్ డబుల్ యాక్షన్ లో దుమ్ము దులపడంతో ఇతర నటుల అవసరం కూడా లేకపోయింది. జవాన్ సినిమాలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్ తళుక్కుమంది. మంచి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ లో దీపికా సందడి చేసింది. నయనతార హీరోయిన్గా నటించగా.. విజయ్ సేతుపతి విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ప్రియమణి, సాన్య మల్హోత్రా, సునీల్ గ్రోర్ కీలకపాత్రల్లో కనిపించారు. సన్ డే వరకూ చాలా ప్రాంతాల్లో హౌస్ ఫుల్ బోర్డులు పడిపోయాయి.
Next Story