Sun Dec 22 2024 18:51:37 GMT+0000 (Coordinated Universal Time)
జవాన్ సరికొత్త రికార్డులు
షారుక్ ఖాన్ హీరోగా, నయనతార పోలీస్ ఆఫీసర్ గా అలరించిన ఈ సినిమా సెప్టెంబర్ 7న
‘జవాన్’ సినిమా బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ ఉంది. షారుక్ ఖాన్ హీరోగా, నయనతార పోలీస్ ఆఫీసర్ గా అలరించిన ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదలై మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఏడో రోజు కూడా ఈ సినిమా రూ.23 కోట్లు నెట్ ఇండియా కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ ఇచ్చాయి. హిందీ వెర్షన్‌కు రూ.21.5 కోట్లు, తమిళం రూ. 95 లక్షలు, తెలుగు వెర్షన్‌కు రూ.85 లక్షలు వచ్చినట్లు సమాచారం. వరల్డ్ వైడ్‌గా ఏడురోజుల్లో రూ.368.38 కోట్లు నెట్ కలెక్షన్స్‌తో పాటు రూ. 665 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వారంలో రూ. 650 కోట్ల మార్క్ దాటిన తొలి హిందీ చిత్రంగా ‘జవాన్’ రికార్డుకెక్కింది.
వారం రోజుల్లో అత్యధిక వసూళ్లు సాధించిన 4వ భారతీయ చిత్రంగా నిలిచింది ‘జవాన్’. మొదటి రోజు ఈ సినిమా రూ. 75 కోట్లు నెట్ రాబట్టగా.. రెండో రోజు రూ. 53.23 కోట్లు, మూడో రోజు రూ. 77.83 కోట్లు, నాలుగో రోజు రూ. 80.10 కోట్లు, ఐదో రోజు రూ. 32.92 కోట్లు, ఆరో రోజు రూ. 26 కోట్లు వసూలు చేసి సత్తా చాటుకుంది. ఏడో రోజు ప్రపంచ వ్యాప్తంగా 'జవాన్' మూవీ రూ. 23.30 కోట్లు నెట్, రూ. 44 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది. వారంలోనే రూ. 650 కోట్లు మార్క్ దాటిన మొదటి హిందీ చిత్రంగా ఇది రికార్డు సాధించింది. పఠాన్ రూ. 630 కోట్లు వసూలు చేసింది.
Next Story