Mon Dec 23 2024 16:27:17 GMT+0000 (Coordinated Universal Time)
అడల్ట్ సినిమాల్లో నటించడానికి కారణం చెప్పిన షకీలా..
90's టైంలో బోల్డ్ క్యారెక్టర్లతో సౌత్ సినీ పరిశ్రమని ఒక ఊపు ఊపిన 'షకీలా'.. అడల్ట్ సినిమాల్లో నటించడానికి కారణం తెలియజేశారు.
90's టైంలో బోల్డ్ క్యారెక్టర్లతో సౌత్ సినీ పరిశ్రమని ఒక ఊపు ఊపిన 'షకీలా'.. ప్రస్తుతం వెండితెర పై పెద్దగా కనిపించడం లేదు. అయితే పలు టీవీ షోల్లో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా ఈమె తెలుగు రియాలిటీ షో బిగ్బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇదే హౌస్ లోకి 'టేస్టీ తేజ' కూడా కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. ఇండస్ట్రీలో పలు స్టార్స్ తో భోజనం చేస్తూ ఇంటర్వ్యూలు చేసి ఫేమస్ అయిన తేజ.. ఇంటిలో కూడా ఇదే పనిని కొనసాగిస్తున్నాడు.
హౌస్ లో ఉన్న షకీలాని కొన్ని ప్రశ్నలు వేసి ఒక షార్ట్ ఇంటర్వ్యూ చేశాడు. అసలు మీరు ఎందుకని అడల్ట్ సినిమాల్లో నటిస్తూ వచ్చారని తేజ ప్రశ్నించాడు. దీనికి షకీలా బదులిస్తూ.. "మొదటిలో చిన్న చిన్న రొమాంటిక్ సినిమాల్లో నటించాను. వాటిలో పొట్టి నిక్కర్లు వేసుకొని అందాల ఆరబోస్తూ డాన్స్ చేసేదాన్ని. అలా చేయడంలో తప్పు లేనప్పుడు అడల్ట్ సినిమాల్లో నటిస్తే తప్పేంటి అనిపించింది. ఇక నాకు కూడా ఆ సమయంలో ఆ సినిమా అవకాశాలే ఎక్కువ రావడంతో.. వరుసగా అవే చిత్రాల్లో నటిస్తూ ముందుకు వెళ్ళాను" అంటూ బదులిచ్చారు.
మరి ఇలాంటి సినిమాల్లో నటిస్తుంటే మీ ఇంటిలో వాళ్ళు ఏమి అనలేదా..? అని ప్రశ్నించగా, షకీలా బదులిస్తూ.. ''డబ్బులు బాగా వచ్చేవి. సంపాదన బాగుండేది. దీంతో వాళ్ళు ఏమీ అనలేదు'' అంటూ వెల్లడించారు. ఇక కెరీర్ మొత్తంలో అలాంటి సినిమాలు ఎన్ని చేశారు అని ప్రశ్నించగా.. దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించినట్లు పేర్కొన్నారు. కాగా షకీలా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే మిగిలిపోయారు. అయితే కొంతమంది ట్రాన్స్జెండర్లను దత్తత తీసుకోని తన గొప్ప మనసుని చాటుకున్నారు.
ప్రస్తుతం వారి బాగోగులు అని ఆమె చూసుకుంటూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే, షకీలా బిగ్బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఇది రెండోసారి. 2014లో కన్నడ బిగ్బాస్ షోలో కంటెస్టెంట్ పోటీ చేశారు. అయితే నెల రోజులు గడవక ముందే ఎలిమినేట్ అయ్యి ఆ షో నుంచి బయటకి వచ్చేశారు. మరి ఈసారి అయినా బోగ్బాస్ టైటిల్ ని సొంతం చేసుకుంటారా..? అనేది వేచి చూడాలి.
Next Story