షాలిని పాండే పై ఫైర్ అవుతున్న నిర్మాతలు
మొదటి సినిమా అర్జున్ రెడ్డి తో సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్ షాలిని పాండే ఈ సినిమా తరువాత టాలీవుడ్ లో కళ్యాణ్ రామ్ తో 118 [more]
మొదటి సినిమా అర్జున్ రెడ్డి తో సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్ షాలిని పాండే ఈ సినిమా తరువాత టాలీవుడ్ లో కళ్యాణ్ రామ్ తో 118 [more]
మొదటి సినిమా అర్జున్ రెడ్డి తో సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్ షాలిని పాండే ఈ సినిమా తరువాత టాలీవుడ్ లో కళ్యాణ్ రామ్ తో 118 అనే సినిమా చేసి పర్లేదు అనిపించుకుంది. కాకపోతే తమిళంలో సినిమాలు చేస్తున్న షాలిని ప్రస్తుతం తెలుగులో రాజ్ తరుణ్ హీరోగా ఇద్దరి లోకం ఒకటే అనే చిత్రంలో నటిస్తుంది. అలానే అనుష్కతో నిశ్శబ్ధంలో నటిస్తోంది. అంతేకాదు తమిళంలో రెండు మూడు చిత్రాలు కమిట్ అయ్యి నటిస్తున్న షాలిని కి బాలీవుడ్ నుంచి ఆఫర్స్ రాగానే వెంటనే ముంబై కి మకాం మార్చేసింది.
ఇదేం పద్దతి…..
ఇక్కడ మూవీస్ కి డేట్స్ ఇచ్చి, షూటింగ్ కంప్లీట్ చేయకుండా ముంబయి వెళ్లిపోవడమేంటని నిర్మాతలు ఫైర్ అవుతున్నారు. షాలిని మేనేజర్ ని కాంటాక్ట్ చేస్తే ఆ మేనేజర్ కే ఆమె అందుబాటులో లేదని తెలుస్తుంది. మేనేజర్ ని కూడా మార్చేసిందని, ముంబై లో కొత్త పీఆర్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకుందని సమాచారం. దీంతో షాలినికి వచ్చిన ఆ హిందీ అవకాశాన్ని చెడగొట్టి అయినా ఇక్కడి సినిమాలు పూర్తి చేయించాలని నిర్మాతలు సీరియస్ అవుతున్నారు. ఆమెపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసి అవసరమయితే నష్ట పరిహారం వసూలు చేయాలని కూడా చూస్తున్నారు.