Sun Dec 22 2024 22:25:57 GMT+0000 (Coordinated Universal Time)
శంకర్ - చరణ్ మూవీ టైటిల్ ఇదే.. ఈ రోజే చరణ్ ఫస్ట్ లుక్
టైటిల్ అదిరిపోయిందంటూ..ఈ గ్లోబల్ స్టార్ అభిమానులు సంబరపడిపోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. దేశ, విదేశాల్లో చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారు. కాగా.. చెర్రీ పుట్టినరోజు సందర్భంగా #RC15 టైటిల్ తో రూపొందుతోన్న సినిమా టైటిల్ ను చిత్రబృందం ప్రకటించింది. టైటిల్ అదిరిపోయిందంటూ..ఈ గ్లోబల్ స్టార్ అభిమానులు సంబరపడిపోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. సౌత్ లో తిరుగులేని డైరెక్టర్ గా కొనసాగుతున్న శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు 'గేమ్ చేంజర్' అనే టైటిల్ పెట్టారు.
శంకర్ - చరణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా, ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో.. దీనిపై భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర, ఎస్ జే సూర్య తదితరులు నటిస్తున్నారు. టైటిల్ ద్వారానే హీరో పాత్ర ఎంత శక్తివంతంగా ఉంటుందో శంకర్ తనదైన శైలిలో చెప్పేశాడు. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించనున్నాడు. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ కూడా ఈరోజే విడుదల కానుంది.
Next Story