Sun Dec 22 2024 21:54:51 GMT+0000 (Coordinated Universal Time)
Game Changer : గేమ్ ఛేంజర్ షూటింగ్ని శంకర్ అందుకే లేటు చేస్తున్నాడట..
శంకర్ గేమ్ ఛేంజర్ షూటింగ్ ని లేటు చేయడానికి కారణం ఇండియన్ 2 కాదట. అసలు కారణం ఇదే అంటూ ఒక వీడియో వైరల్ అవుతుంది.
Game Changer : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. 2021లో మొదలైన ఈ సినిమా ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. అంతేకాదు ఈ మూవీ నుంచి ఒక టైటిల్ అనౌన్స్మెంట్ తప్ప ఇప్పటి వరకు మరో అప్డేట్ లేదు. దీంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇన్నాళ్లు ఇండియన్ 2 షూటింగ్ వలనే శంకర్ గేమ్ ఛేంజర్ షూటింగ్ ని లేటు చేస్తున్నాడని అనుకున్నారు. కానీ ఆయన లేటు చేయడానికి అసలు కారణం ఇదే అంటూ అభిమానులు చెబుతున్నారు. ఇంతకీ ఆ రీజన్ ఏంటి..?
శంకర్ కూతురు అదితి ఇటీవల హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక అవార్డుల వేడుకలో అదితిని.. తన పర్సనల్ లైఫ్ లో ఫేవరెట్ క్రష్ ఎవరని అడిగారు. దానికి అదితి బదులిస్తూ.. సెలబ్రిటీ క్రష్ రామ్ చరణ్ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియో చూసిన చరణ్ అభిమానులు.. "గేమ్ ఛేంజర్ షూటింగ్ ని మీ కూతురు కోసం లేటు చేస్తున్నారా శంకర్ సార్" అంటూ సరదా పోస్టులు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టులతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
కాగా గేమ్ ఛేంజర్ షూటింగ్ ని ఫిబ్రవరి లోపు పూర్తి చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కి చాలా సమయం తీసుకోనుందని చెబుతున్నారు. 2024 దసరా టైములో ఈ సినిమాని రిలీజ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ 'జరగండి'ని రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన మూవీ టీం.. ఇప్పటి వరకు ఆ పాటని విడుదల చేయలేదు. న్యూ ఇయర్ టైములో ఏమైనా రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి మేకర్స్ ఏం చేస్తారో చూడాలి.
Next Story