Mon Dec 23 2024 12:36:57 GMT+0000 (Coordinated Universal Time)
సిరిని కాల్చుకు తింటున్నాడే
బిగ్ బాస్ సీజన్ 5 లో అత్యంత తక్కువగా టాస్క్ లు చేస్తూ నెట్టుకొస్తుంది ఒక్క షణ్ముఖ్ జస్వంత్.
బిగ్ బాస్ సీజన్ 5 లో అత్యంత తక్కువగా టాస్క్ లు చేస్తూ నెట్టుకొస్తుంది ఒక్క షణ్ముఖ్ జస్వంత్. అసలు ఎందుకు బిగ్ బాస్ హౌస్ లో కూడా ఉంచాడో కూడా తెలియదు. సిరిని కాల్చుకు తింటున్నాడు. ముచ్చులాగా ఉండేవాళ్లను నమ్మ కూడదంటారు. ఓపెన్ గా సిరి ఉంటుంది. ఫెయిర్ గా ఉండే సిరిని రోజూ ఏడిపించుకు తింటున్నాడు షణ్ముఖ్. బిగ్ బాస్ నిర్వాహకులకు ఎలా ఉందో్ కాని షణ్ముఖ్ ను మాత్రం ప్రేక్షకులు భరించలేకపోతున్నారు.
ఎవరితోనూ....
షణ్ముఖ్ వీర లెవెల్లో ఫ్యాన్స్ ఉండి ఉండవచ్చు గాక. అతను పెద్ద తోపు కావచ్చు కాక. కానీ ముచ్చుగా ఉంటూ సిరి వేరేవారికి దగ్గరవుతుందన్న భయంతో ఆమెను ఏడిపిస్తుండటంతో సోషల్ మీడియాలో కూడా షణ్ణును తప్పుపడుతున్నారు. సన్నీ, కాజల్ కు దూరంగా ఉండాలని షరతులు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. షణ్ముఖ్ ఇగోతో ఇలా వ్యవహరిస్తున్నారని, చూస్తుంటేనే చిరాకు వేస్తుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో విన్పిస్తున్నాయి. పెద్ద బద్ధకిస్టు. ఎప్పుడు చూసినా కూర్చునే ఉంటాడు. సిరిని తన ఆట ఆడుకోనివ్వకుండా డామినేషన్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఫ్రెండ్ షిప్ కటీఫ్ అంటూ బెదిరిస్తున్నాడు. బిగ్ బాస్ ఇంక చాలు.. ఈ షణ్ముఖ్ ను బయటక పంపండి అన్న కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి.
Next Story