Sun Dec 22 2024 23:01:57 GMT+0000 (Coordinated Universal Time)
రూమర్స్ కు బ్రేక్.. శర్వానంద్ డెస్టినేషన్ వెడ్డింగ్ డేట్ ఫిక్స్
శర్వానంద్ - రక్షితలు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. జూన్ 2,3 తేదీల్లో రాజస్థాన్ జైపూర్ లోని లీల్ ప్యాలెస్ లో..
టాలీవుడ్ యువ హీరోల్లో మూడు పదులు దాటినా ఇంకా బ్యాచిలర్స్ గానే ఉన్న హీరోలు పదుల సంఖ్యలో ఉన్నారు. వారిలో శర్వానంద్ ఒకరు. ఈ ఏడాది జనవరిలో శర్వానంద్ .. రక్షిత అనే యువతితో నిశ్చితార్థం జరుపుకున్నారు. అయితే ఆ తర్వాత పెళ్లిపై ప్రకటన లేకపోవడంతో.. వారిద్దరూ విడిపోయారని శర్వానంద్ ఎంగేజ్ మెంట్ బ్రేక్ చేసుకున్నారని రూమర్స్ వచ్చి, వైరల్ అయ్యాయి.
అవన్నీ పుకార్లేనని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని శర్వా తన మేనేజర్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు. శర్వానంద్ - రక్షితలు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. జూన్ 2,3 తేదీల్లో రాజస్థాన్ జైపూర్ లోని లీల్ ప్యాలెస్ లో వీరి వివాహం ఘనంగా జరగనుంది. నేటి నుంచే పెళ్లి కార్యక్రమాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. వివాహ వేడుకకు శర్వాకు చిన్ననాటి మిత్రుడైన రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో పాటు ఇతర సినీ ప్రముఖులు హాజరవుతారని సమాచారం.
Next Story