మార్కెట్ పడిపోయినా.. శాటిలైట్ నిలబెట్టింది!
మహానుభావుడు హిట్ తర్వాత శర్వానంద్ హను రాఘవపూడితో కలిసి పడి పడి లేచే మనసు సినిమా చేసాడు. హను రాఘవపూడి ‘లై’ సినిమా డిజాస్టర్ తో ఉన్నప్పటికీ… [more]
మహానుభావుడు హిట్ తర్వాత శర్వానంద్ హను రాఘవపూడితో కలిసి పడి పడి లేచే మనసు సినిమా చేసాడు. హను రాఘవపూడి ‘లై’ సినిమా డిజాస్టర్ తో ఉన్నప్పటికీ… [more]
మహానుభావుడు హిట్ తర్వాత శర్వానంద్ హను రాఘవపూడితో కలిసి పడి పడి లేచే మనసు సినిమా చేసాడు. హను రాఘవపూడి ‘లై’ సినిమా డిజాస్టర్ తో ఉన్నప్పటికీ… శర్వానంద్ హనుని నమ్మి లవ్ స్టోరీ చేసాడు. కానీ శర్వా నమ్మకాన్ని హను రాఘవపూడి నిలబెట్టలేకపోయాడు. పడి పడి లేచే మనసు సినిమా ఫ్లాప్ లిస్ట్ లోకి వెళ్లిపోయింది. గత ఏడాది డిసెంబర్ 21న విడుదలైన ఈ సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. సాయి పల్లవి – శర్వాల నటన కూడా సినిమాని కాపాడలేకపోయింది. దీంతో శర్వానంద్ మార్కెట్ అనూహ్యంగా పడిపోయింది. మరి సినిమాలు ఫ్లాప్ అయితే హీరోల మార్కెట్ మీద దెబ్బ పడడం అనేది సర్వసాధారణ విషయమే.
భారీ ధరకు కొన్న జెమిని
తాజాగా శర్వానంద్ – సుధీర్ వర్మల కాంబోలో తెరకెక్కుతున్న సినిమా మీద మార్కెట్ లో ఎలాంటిది అంచనాలు లేవు. అసలు ఆ సినిమాకి ఇంకా బిజినెస్ కూడా మొదలవ్వలేదు. బయ్యర్లేవరు శర్వా సినిమా కొనేందుకు ఆసక్తి చూపడం లేదని టాక్. చాలా డల్ గా వుంది వ్యవహారం. అయితే ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకి మార్కెట్ అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ.. శాటిలైట్ హక్కులు మాత్రం రికార్డు స్థాయికి అమ్ముడుపోయాయట. ప్రముఖ ఛానల్ జెమిని టివి శర్వానంద్ – సుధీర్ వర్మల సినేమాకు ఏకంగా 8 కోట్లకు శాటిలైట్ హక్కులను కొనేశారని.. 8 కోట్లకు డీల్ క్లోజ్ చేసారని అంటున్నారు. 8 కోట్లు శర్వా సినిమాకి పలకడం ఇదే మొదటిసారి. మరి సినిమాలో అంతగా ఏముందో.. ఎందుకు జెమిని ఛానల్ తొందర పడిందో అంటూ చర్చలు మొదలయ్యాయి.