Wed Mar 26 2025 20:17:50 GMT+0000 (Coordinated Universal Time)
శిల్పా శెట్టికి మరో కష్టం
శిల్పాశెట్టి కుటుంబం మరో వివాదంలో చిక్కుకుంది. ముంబయి కోర్టు శిల్పా శెట్టి కుటుంబానికి నోటీసులు జారీ చేసింది.

శిల్పాశెట్టి కుటుంబం మరో వివాదంలో చిక్కుకుంది. ముంబయి కోర్టు శిల్పా శెట్టి కుటుంబానికి నోటీసులు జారీ చేసింది. రుణం ఎగ్గొట్టిన కేసులో శిల్పశెట్టితో పాటు ఆమె తల్లి, సోదరికి కూడా సమన్లు జారీ చేసింది. శిల్పాశెట్టి కుటుంబం ఇప్పటికే అనేక కష్టాలను ఎదుర్కొంటుంది.
లోన్ ఎగవేత కేసులో...
శిల్పా భర్త రాజ్ కుంద్రా ఇటీవల పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దాని నుంచి బయట పడకముందే రుణం ఎగవేత కేసు శిల్పా కుటుంబం మెడకు చుట్టుకుంది. కోర్టుకు హాజరుకావాలని పేర్కొంది. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది.
Next Story